Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: రోహిత్ వస్తే అతనిపై వేటు.. రెండో టెస్టు ఆడే జట్టు ఇదే..!

 Who will miss out INDvsBAN second test for Rohit Sharma

చట్టోగ్రాం వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. తొలి ఇన్నిగ్స్‌లో పుజరా (90), శ్రేయాస్ అయ్యర్ (86), అశ్విన్ (58) అదరగొట్టడంతో భారత్‌కు భారీ స్కోరు దక్కింది. ఇక రెండ ఇన్నింగ్స్‌లో కూడా పుజారా (102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (110) ఇద్దరూ సెంచరీలు చేయడంతో బంగ్లా ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. ఛేజింగ్‌లో బంగ్లా బ్యాటర్లు పట్టుదల చూపించినప్పటికీ.. భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకోవడంత ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు.
రోహిత్ రాకతో సమస్య..

రోహిత్ రాకతో సమస్య..

ఈ టెస్టు సిరీస్‌లో విజయం భారత్‌కు చాలా కీలకం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌లో భారత్ తప్పక నెగ్గి తీరాలి. దీంతోపాటు ఆ తర్వాాత జరిగే టెస్టుల్లో కూడా గెలవాలి. ఇలాంటి నేపథ్యంలోనే ఢాకాలోని షేర్ ఎ బంగ్లా మైదానంలో జరిగే రెండో టెస్టుకు భారత రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తిరిగొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి రోహిత్ వస్తే ఎవర్ని పక్కన పెట్టి అతన్ని తీసుకుంటారనే అనుమానాలు అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. రాణిస్తున్న గిల్‌ను పక్కన పెట్టాలా? లేక వరుసగా విఫలం అవుతున్న రాహుల్‌ను తీసేసే ఛాన్స్ ఉందా? అనేదే ప్రధాన సమస్య.

అతనిపై వేటు తప్పదా..?

అతనిపై వేటు తప్పదా..?

రెండో వన్డే సందర్భంగా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసే సమయంలో టీమిండియా సారధి రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైంది. అక్కడ ఎముక జాయింట్ నుంచి పక్కకు తొలగడంతో అతన్ని వెంటనే ముంబై పంపిచేశారు .ఇక్కడ నిపుణుల పర్యవేక్షణ తర్వాత అతను రెండో టెస్టు సమయానికి జట్టుతో చేరతాడని బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్టు గెలిచి ఊపుమీదున్న భారత జట్టులో రోహిత్ కోసం ఎవర్ని పక్కన పెడతారనే ప్రశ్న తలెత్తింది. దీనిపై కొందరు మాట్లాడుతూ.. ఎవరైనా స్పిన్నర్‌ను తొలగించి రోహిత్‌కు ఆడే అవకాశం కల్పిస్తారని, లేదంటే తొలి టెస్టు సెంచరీ సాధించిన గిల్‌ను పక్కనపెట్టాల్సి వస్తుందని అంటున్నారు.

గిల్‌కు నో ఛాన్స్..?

గిల్‌కు నో ఛాన్స్..?

తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతోనూ వడిసి పట్టుకున్నా గిల్‌పై వేటు తప్పేలా కనిపించడం లేదు. కేఎల్ రాహుల్ రాణించకున్నా అతను వైస్ కెప్టెన్ కాబట్టి జట్టులో కొనసాగుతాడు. గిల్ రాణించినా కూడా అతను రిజర్వ్ ఓపెనరే కదా. కాబట్టి రోహిత్ రాకతో గిల్ తప్పుకోక తప్పదని తెలుస్తోంది. అదే సమయంలో ఒక వేళ భుజం గాయంతో బాధ పడుతున్న మహమ్మద్ షమీ కూడా తిరిగొస్తే ఉమేష్ యాదవ్, సిరాజ్‌లలో ఒకరిని పక్కన పెట్టాల్సి వస్తుంది. వీరిలో ఉమేష్‌ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. కానీ షమీ ఈ మ్యాచ్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. కాబట్టి బౌలింగ్ యూనిట్‌లో రెండో టెస్టులో మార్పులేమీ చేయకపోవచ్చు.

భారత తుది జట్టు (అంచనా)

భారత తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ / మహమ్మద్ షమీ.

Story first published: Monday, December 19, 2022, 13:06 [IST]
Other articles published on Dec 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+