ఆరో స్థానం ఎవరికి..? ఆల్‌రౌండర్.. బ్యాట్స్‌మానా..
హైదరాబాద్: మున్ముందు చేయాల్సిన దక్షిణాఫ్రికా టెస్టును దృష్టిలో ఉంచుకున్న భారత్‌కు పెద్ద సవాల్ ఎదురైంది. జట్టులో ఆరో స్థానం ఎవరికి ఇవ్వాలనేదే సందిగ్ధం. మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్స్‌తో ఏడు నుంచి మిగతా అయిదు మంది బౌలర్లుగా అనుకుంటే మరి ఆరో స్థానం ఎవరికి దక్కాలి. అయితే ఈ స్థానానికి ఆల్‌రౌండర్ అయితే కరెక్ట్ అని పలువాదనలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఈ స్థానం కోసం రోహిత్, హార్దిక్ పాండ్యా మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. సరిగ్గా సరిపోయే అభ్యర్థిని ఎంచుకోవాల్సిన విరాట్ కోహ్లీ ఎవర్ని ఎంచుకుంటాడన్నది ఆసక్తికరమైన అంశం.

చక్కని ప్రణాళిక
ఈ ఏడాది ప్రథమార్థం నుంచి భారత్ జట్టు విజయాలతో దూసుకెళ్తుంది. దానికి కారణం సమిష్టి కృషి అనుకోవచ్చు. వ్యక్తిగత నైపుణ్యం కావొచ్చ. చక్కని ప్రణాళిక అయినా అయి ఉండొచ్చు. కానీ ఇవన్నీ సొంత గడ్డపై ఆడటంలో ఒక ఎత్తైతే విదేశీ పర్యటనలో గెలుచుకోవడం మరో ఎత్తు. అందుకే టీంను పటిష్టం చేసే దిశగా విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో ఎవర్ని తీసుకుంటాడనేది ప్రశ్న.

హార్దిక్ పాండ్యా
అయితే మరో మూడు వారాల్లో టీమ్‌ఇండియాకు దక్షిణాఫ్రికా గడ్డపై కఠినమైన బౌన్సీ పిచ్‌లు ఎదురుకానున్నాయి. ఉపఖండంలో అశ్విన్ ఈ స్థానాన్ని కొంత భర్తీ చేసినా.. దక్షిణాఫ్రికాలో ఈ వ్యూహం పని చేయదని కెప్టెన్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే ఈ స్థానం కోసం హార్దిక్ పాండ్యాను తీసుకోవాలని భావిస్తున్నాడు. ఎందుకంటే లంక పర్యటనలో ఎనిమిదో నంబర్‌లో దిగి పాండ్యా సెంచరీ కొట్టాడు. దక్షిణాఫ్రికాలో పాండ్యాను ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దింపడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే ఈ స్థానంలో ఆడే ఆటగాడు చాలా రాటుదేలి ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితమే మారిపోతుంది. కానీ ఇప్పుడిప్పుడే ఐదు రోజుల ఫార్మాట్ మొదలుపెట్టిన పాండ్యాకు అంతగా అనుభవం లేదన్నది మాజీల అభిప్రాయం.

రోహిత్ శర్మ
ఆరో స్థానం కోసం రోహిత్ శర్మ మొట్టమొదటి చాయిస్. లంకతో టెస్టు సిరీస్‌లోనూ అతను ఆకట్టుకున్నాడు. అయితే ప్రొటీస్ గడ్డపై ఈ ముంబైకర్ పెద్దగా విజయవంతంకాకపోవడం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. 2013లో ఇక్కడ ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 45 పరుగులే చేశాడు. దీని కారణంగా అతని టెస్టు కెరీర్ వేగం పుంజుకోలేదు. రోహిత్‌కు కూడా ఇక్కడ మెరుగైన రికార్డు లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అజింక్యా రహానే
విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న అజింక్యా రహానే ఈ స్థానానికి సరిగ్గా సరిపోతాడని మరికొందరి వాదన. గతంలో ఇక్కడ పర్యటించినప్పుడు అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 209 పరుగులు చేశాడు. భారత్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్థానం సంపాదించాడు. అత్యంత బౌన్సీ పిచ్ ఉన్న డర్బన్‌లోనూ రహానే 96 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ ముంబై బ్యాట్స్‌మన్ ఇప్పుడు సరైన ఫామ్ లేకపోవడం కోహ్లీకి ఎటూ తేల్చుకోలేని అంశంగా మారింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications