కాన్పూర్: టీమిండియా చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. న్యూజిలాండ్ జట్టుతో ఆడబోతున్న ప్రతిష్టాత్మక 500వ టెస్టు మ్యాచ్‌ను చిరకాలం గుర్తుంచుకునేలా ఏర్పాట్లను బీసీసీఐ చేస్తోంది. కోహ్లీ నేతృత్వంలోని యువ జట్టుకు ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కింది.
500: సర్వం సిద్ధం, ఆటగాళ్ల ఫోటోషూట్, కమ్మని రుచులు
ఈ నెల 22న కాన్పూర్‌లో జరగనున్న టెస్టు భారత్ జట్టుకు 500వది కావడం విశేషం. 1932లో ప్రారంభమైన భారత టెస్టు క్రికెట్ ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకమైంది. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు మాత్రమే 500కు పైగా టెస్టులు ఆడిన ఘనతను సొంతం చేసుకున్నాయి.
ఈ సందర్భంగా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కొన్ని మైలురాళ్లు మీ కోసం:
* భారత టెస్టు క్రికెట్లో మొట్టమొదటి సారి సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ లాలా అమర్నాథ్. దక్షిణ ముంబైలోని జింఖానా గ్రౌండ్స్‌లో 1933లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాలా 118 పరుగులు చేశాడు.
* భారత్ తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ని 1932లో క్రికెట్ మక్కాగా పేరుగాంచిన ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఆడింది. కల్నల్ సీకే నాయుడు తొలి కెప్టెన్గా వ్యవహరించారు.
* భారత జట్టు తొలిసారిగా టెస్టు మ్యాచ్ లో విజయం సాధించింది మాత్రం 1952లో. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
వేడుకలా 500వ టెస్ట్ మ్యాచ్: మాజీ కెప్టెన్లందరికీ ఆహ్వానం
* ఇక మొదటి టెస్టు సిరిస్ విజయం 1971లో దక్కింది. ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన ఈ సిరిస్‌ను భారత్ జట్టు 1-0తేడాతో గెలుపొందింది.
* ఇప్పటివరకు టీమిండియా సాధించిన విజయాల్లో 2007లో బంగ్లాదేశ్‌పై సాధించిన విజయమే అతి పెద్ది విజయం. బంగ్లా రాజధాని ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్, 219 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
* ఇక భారత్ అత్యంత చెత్తగా వెస్టిండిస్ చేతిలో ఓటమి పాలైంది. 1958లో కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్, 336 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
* టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా భారత బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ 200 టెస్టులాడి మొత్తం 15,921 పరుగులు సాధించాడు.
* భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. 132 టెస్టుల్లో 619 వికెట్లను కుంబ్లే తన ఖాతాలో వేసుకున్నాడు.