న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: సూర్య, కోహ్లీ ఎన్ని సిక్సర్లు కొట్టారు?.. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరంటే..

who smashed most number of sixes in T20 World Cup 2022

ఈసారి టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరిగింది. ఇక్కడ మైదానాలు పెద్దవిగా ఉంటాయి. ఈ మైదానాల్లో సిక్సర్లు బాదడం అంత ఈజీ కాదు. కానీ బ్యాటర్లు మాత్రం భారీ సిక్సర్లు కొట్టేందుకు ఇష్టపడతారు. మ్యాచులు చూసే అభిమానులు కూడా క్రికెటర్లు సిక్సర్లు కొడితే ఉత్సాహంతో ఊగిపోతారు. పెద్ద జట్లు అన్నీ పోటీలో ఉన్నప్పటికీ ఈ ఏడాది ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా నిలిచాడు.

సికందరే టాపర్

సికందరే టాపర్

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో సికందర్ రజా ఏకంగా 11 సిక్సర్లు బాదాడు. జింబాబ్వే గెలిచిన ప్రతి మ్యాచులోనూ బ్యాటింగ్, బౌలింగ్ ఏదో ఒక విభాగంలో అద్భుతం రాణించిన అతను.. జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. ఫైనల్ చేరిన ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ 10 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో కూడా అతను రాణించి ఉంటే సికందర్ రజాను దాటేసేవాడే. కానీ ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

రెండు, మూడు స్థానాల్లో..

రెండు, మూడు స్థానాల్లో..

అలెక్స్ హేల్స్‌తోపాటు శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ కూడా 10 సిక్సర్లు బాదాడు. ఈ జట్టు సెమీఫైనల్ వరకూ రాకపోయినా మెండిస్ అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే హేల్స్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత మూడో ర్యాంకులో నలుగురు ఆటగాళ్లు సంయుక్తంగా నిలిచారు. ఐర్లాండ్ సారధి బిల్బిర్నీ, ఆసీస్ హల్క్ స్టొయినిస్, మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్, సౌతాఫ్రికా స్టార్ రైలీ రూసో.. వీళ్లందరూ తలో 9 సిక్సర్లతో మూడో స్థానంలో నిలిచారు.

కోహ్లీ ఎన్ని సిక్సర్లు కొట్టాడంటే..

కోహ్లీ ఎన్ని సిక్సర్లు కొట్టాడంటే..

ఈ ఏడాది టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ కూడా సిక్సర్లు బాదడంపై ఫోకస్ పెట్టాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో అతను కొట్టిన రెండు సిక్సర్లు ఆ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ప్రపంచకప్‌లో మొత్తం 296 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ.. అన్ని మ్యాచుల్లో కలిపి 8 సిక్సర్లు బాదాడు. కోహ్లీతోపాటు నెదర్లాండ్ ఆటగాడు మ్యాక్స్ ఓ వుడ్, శ్రీలంక స్టార్ పాథుమ్ నిస్సంక, న్యూజిల్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా తలో 8 సిక్సర్లు బాదారు.

Story first published: Monday, November 14, 2022, 13:48 [IST]
Other articles published on Nov 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X