INDvsAUS : రాహుల్ ప్లేస్‌లో వైస్ కెప్టెన్‌గా ఎవర్ని నియమించాలి?.. ఈ ముగ్గురిలో ఒకరేనా?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో కేఎల్ రాహుల్ దారుణంగా ఆడుతున్నాడు. అయినా సరే అతన్ని జట్టులో కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అతన్ని వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇది చూసిన చాలా మంది.. రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉంటే పక్కన పెట్టడం కుదరదనే ఆలోచనతోనే అతన్ని ఈ హో
దా నుంచి తప్పించారని అంటున్నారు. అదే నిజమైతే రాహుల్ స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఎవరిని నియమించాలి?

జస్‌ప్రీత్ బుమ్రా
భారత జట్టులో అద్భుతమైన రికార్డు ఉన్న బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒకడు. అతని సత్తా చూసిన టీం మేనేజ్‌మెంట్.. ఇంగ్లండ్‌తో గతేడాది జరిగిన టెస్టులో రోహిత్ లేకపోవడంతో అతన్నే కెప్టెన్‌గా నియమించింది. అంతకుముందు సౌతాఫ్రికాలో జరిగిన టూర్‌లో కూడా అతన్నే వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ లెక్కన చూసుకుంటే అతన్ని భవిష్యత్తులో టెస్టు కెప్టెన్‌గా తీర్చిదిద్దాలని సెలెక్షన్ కమిటీ అనుకుందని తెలుస్తోంది. అయితే గాయం కారణంగా అతను జట్టుకు దూరమవడంతో ఈ ప్లాన్లు కొంచెం దూరం జరిగాయి. కానీ గాయం నుంచి కోలుకున్న తర్వాత అతన్నే మళ్లీ వైస్ కెప్టెన్ చేసినా ఆశ్చర్యం లేదు.

రవిచంద్రన్ అశ్విన్
భారత్‌తో టెస్టు సిరీస్ మొదలవడానికి ముందు నుంచే ఆస్ట్రేలియా జట్టు అశ్విన్ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. ఇదొక్కటి చాలు అతను టెస్టు క్రికెట్‌లో ఎంత ప్రభావం చూపించాడో చెప్పడానికి. అలాగే టెస్టుల్లో మాత్రమే ఆడుతుండటంతో ఇంకా చాలా కాలం అతను భారత జట్టుకు సేవలు అందించే అవకాశం ఉంది. అలాగే అతనిది అద్భుతమైన క్రికెట్ బుర్ర అని అశ్విన్ ఆట చూసిన వాళ్లందరికీ తెలిసిపోతుంది. చాలా మంది సీనియర్లు కూడా అశ్విన్‌కు వైస్ కెప్టెన్‌గా అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఈ క్రమంలో అతనికి ఈ అవకాశం దక్కే ఛాన్సులు కూడా బాగానే కనిపిస్తున్నాయి.

ఛటేశ్వర్ పుజారా
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీసులో రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా తొలగించిన సెలెక్టర్లు.. మరో ఆలోచన లేకుండా వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారాను టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించారు. అంటే అతన్ని కూడా జట్టులో ఒక నాయకుడిగా సెలెక్టర్లు చూస్తున్నారని అనడానికి ఇది సంకేతం. జట్టులో మంచి సీనియర్ బ్యాటర్, దానికితోడు ఫామ్ కోల్పోయి మళ్లీ కౌంటీ ఆడి జట్టులోకి మరీ జట్టులోకి వచ్చాడు. దీంతో అతని పట్టుదల, ఆటపై క్రమశిక్షణ అందరినీ ఆకర్షించాయి. అశ్విన్‌తోపాటు పుజారా కూడా కేవలం టెస్టులే ఆడుతున్నాడు. కాబట్టి అతను కూడా మరికొంత కాలం జట్టుకు సేవలు అందించే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమించడం కూడా సబబుగానే కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications