Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీ గడ్డపై తొలి సెంచరీ: ఛేజ్ మాస్టర్ కోహ్లీపై ఎవరేమన్నారు?

Who Said What: World reacts as Virat Kohli's masterclass helps India take 1-0 lead

హైదరాబాద్: అభిమానులు ఏ ముహూర్తన విరాట్ కోహ్లీకి 'ఛేజ్ మాస్టర్' అని పేరు పెట్టారో తెలియదు గానీ ఆ పేరుకి తగ్గట్లుగానే న్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే లక్ష్య ఛేదనలో కోహ్లీ ఆట తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా డర్బన్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ మరో సారి తనదైన షాట్లతో అభిమానులను అలరించాడు.

270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి టీమిండియా కెప్టెన్ కోహ్లీ సెంచరీతో రాణించడంతో 4.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. సఫారీ గడ్డపై టీమిండియా ఛేజ్ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. తొలి వన్డేలో ఛేదనలో తన సత్తా ఏమిటో కోహ్లీ మరోసారి నిరూపించాడు. అంతేకాదు తొలి వన్డేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు.

సఫారీ గడ్డపై కోహ్లీకి వన్డేల్లో ఇది తొలి సెంచరీ. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య 33కు చేరింది. ఇందులో విరాట్ కోహ్లీ 20 సెంచరీలను ఛేజింగ్‌లోనే సాధించడం విశేషం. 20 సెంచరీల్లో 18 సెంచరీలు జట్టుకు విజయాన్ని అందించాయి. కోహ్లీ తన కెరీర్‌లో మొత్తంలో విదేశీ గడ్డపై 15 సెంచరీలు చేశాడు. కోహ్లీ మాస్టర్ క్లాస్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

వీవీఎస్‌ లక్ష్మణ్‌

విరాట్‌ కోహ్లీ.. వాట్‌ ఎ ఛేజర్‌. అద్భుతమైన ఆటగాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన అన్ని దేశాల్లో సెంచరీ సాధించాడు. డర్బన్‌లో అతని సెంచరీ కారణంగా విజయం ఎంతో సులువుగా సొంతమైంది.

వీరేంద్ర సెహ్వాగ్‌

కంగ్రాట్స్‌ ఇండియా. వెరీ వెల్‌ డన్‌. సిరీస్‌కు మంచి ఆరంభం దక్కింది. రహానే ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.

సురేశ్‌ రైనా

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత్‌కు గొప్ప ఆరంభం దక్కింది. జట్టు కలిసికట్టుగా విజయం సాధించింది. రన్‌ మెషిన్‌ కోహ్లీ నుంచి మరో గొప్ప సెంచరీ జాలువారింది. రహానే ఇన్నింగ్స్‌ ఆకట్టుకుంది. సిరీస్‌ను ఇలాగే కొనసాగించండి.

మైకేల్ వాన్

మరోసారి కోహ్లీ తన సత్తా చాటాడు. కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ ఇప్పటి వరకు చూడలేదు.

మహమ్మద్‌ కైఫ్‌

మోడ్రన్‌ మాస్టర్‌ నుంచి 33వ సెంచరీ. ప్రపంచంలో ఎక్కడైనా ఛేజింగ్‌ కింగ్‌ కోహ్లీనే.

ఐసీసీ

వన్డే కెరీర్‌లో 33వ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లీకి అభినందనలు

Story first published: Friday, February 2, 2018, 12:09 [IST]
Other articles published on Feb 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+