For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాపెల్ ఎవడు? సన్‌రైజర్స్ గెలుస్తందనుకున్నా: క్రిస్ గేల్

WHOS IAN CHAPPELL? ASKS WEST INDIES BATSMAN CHRIS GAYLE

హైదరాబాద్: వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ తన దూకుడైన ఆటతీరుతోనే కాదు చురకత్తుల్లాంటి మాటలతోనూ వార్తల్లో నిలువడంలో అందరికంటే ముందుంటాడు. ఆదివారం రాత్రి సియెట్ అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత ముంబై మిర్రర్‌తో క్రిస్ గేల్ సంభాషించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మహిళా జర్నలిస్టుతో జరిగిన ఇంటర్వ్యూను గుర్తుచేస్తూ ఇయాన్ చాపెల్ మీపై నిషేధం విధించమన్నాడు కదా అని అడిగాడు. దానికి స్పందిస్తూ అసలు ఇయాన్ చాపెల్ ఎవరు గేల్ ఎదురు ప్రశ్నించాడు.

అసలు కారణం ఇది:

అసలు కారణం ఇది:

2016 బిగ్‌ బాష్‌ లీగ్‌ సందర్భంగా హోబార్ట్‌ హరికేన్స్‌-మెల్‌బోర్న్ రెనగేడ్స్‌ మ్యాచ్ అనంతరం మహిళా జర్నలిస్టు పట్ల గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ అనంతరం టెన్‌ స్పోర్ట్స్ ప్రజెంటర్‌ మెలానీ మెక్‌లాఫిలిన్‌ గేల్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. గేల్ ఇన్నింగ్స్‌ గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. గేల్ స్పందిస్తూ.. 'నువ్వు చేసే ఈ ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను. నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. మనం కలిసి డ్రింక్స్‌కు వెళ్దామా.. మరీ సిగ్గుతో పొంగిపోకు బేబి' అని అన్నాడు.

ఎలాగైతే గేల్‌కు ఊరట లభించింది:

ఎలాగైతే గేల్‌కు ఊరట లభించింది:

అప్పట్లో ఈ ఘటనపై ఇయాన్‌ చాపెల్‌ స్పందిస్తూ.. గేల్‌ను ప్రపంచ వ్యాప్తంగా నిషేదించాలన్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌లో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ విషయంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం గేల్‌కు 10 వేల యూఎస్ డాలర్లు జరిమానాగా విధించింది. అనంతరం బిగ్ బాష్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలు ఏమైనా జరిగితే మాత్రమే జోక్యం చేసుకుంటామని, ఆటగాళ్ల నియమాకాల విషయం మాత్రం తమకు సంబంధం లేదని, బిగ్ బాష్‌లీగ్‌లో గేల్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్ సదర్లాండ్‌ పేర్కొనడంతో గేల్‌కు ఊరట లభించింది.

క్రీజులో పరుగుల తీయడానికి వెనకడుగు

క్రీజులో పరుగుల తీయడానికి వెనకడుగు

క్రీజులో పరుగుల తీయడానికి వెనకడుగేస్తారన్న ప్రశ్నకు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవసరమైతే నాలుగు పరుగులు కూడా తీస్తానన్నాడు. ఈ సీజన్‌ కింగ్స్‌పంజాబ్‌ తరపున బరిలోకి దిగిన గేల్‌.. ప్రారంభ మ్యాచుల్లో విధ్వంసం సృష్టించినా చివర్లో తడబడటంతో ఆ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

సన్‌రైజర్స్‌ గెలుస్తుందనుకున్నానని

సన్‌రైజర్స్‌ గెలుస్తుందనుకున్నానని

ఐపీఎల్ ఫైనల్‌పై స్పందిస్తూ.. రెండు బీకర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చూడకుండా ఉంటామా అని, 179 పరుగులు సాధించిన సన్‌రైజర్స్‌ గెలుస్తుందనుకున్నానని, కానీ షేన్‌ వాట్సన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నైని గెలిపించాడని గేల్‌ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 30, 2018, 12:40 [IST]
Other articles published on May 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+