Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : రెండో టీ20లో ఎవరు హిట్?.. ఎవరు ఫ్లాప్?

Who played how in second INDvsNZ T20I

ఉత్కంఠ భరితంగా జరిగిన భారత్, న్యూజిల్యాండ్ రెండో టీ20లో ఎట్టకేలకు విజయం భారత్‌నే వరించింది. బౌలింగ్‌కు పూర్తిగా సహకరించిన పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఆటగాళ్లు తడబడ్డారు. దీంతో ఆ జట్టు కేవలం 99 పరుగులే చేయగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు కూడా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో ఎవరు హిట్? ఎవరు ప్లాప్?

భారత ఓపెనర్లు ఫ్లాప్

భారత ఓపెనర్లు ఫ్లాప్

కివీస్ చేసిన స్కోరు చూసి.. దీన్ని భారత ఓపెనర్లే కొట్టేస్తారని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. టీమిండియా ఓపెనర్లు తమ చెత్త ఫామ్ కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో మరోసారి పుల్ షాట్ ఆడబోయిన శుభ్‌మన్ గిల్ (11 బంతుల్లో 9) డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫిన్ అలెన్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు. ఇక ఇషాన్ కిషన్ అయితే పరమ జిడ్డు బ్యాటింగ్ చేశాడు, గిల్ అవుటైన తర్వాాత కూడా వేగం పెంచలేదు. చివరకలు 12 బంతుల్లో కేవలం 19 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంత ఘోరంగా ఓపెనర్లు విఫలమవడం చూసిన అభిమానులు మండిపడుతున్నారు.

కివీస్ బౌలింగ్ హిట్

కివీస్ బౌలింగ్ హిట్

న్యూజిల్యాండ్ బౌలింగ్ యూనిట్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసింది. కాపాడుకోవాల్సిన లక్ష్యం చిన్నదే అయినా కూడా.. భారత బ్యాటర్లను ప్రతి పరుగు కోసం చెమటోడ్చేలా చేశారు. ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి భారీ హిట్టర్లు కూడా వేగంగా ఆడలేకపోయారు. దీనికితోడు కివీస్ ఫీల్డర్లు కూడా అత్యద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. దీంతో భారత జట్టు స్వల్ప లక్ష్య ఛేదనలో చెమటలు చిందించాల్సి వచ్చింది.

న్యూజిల్యాండ్ బ్యాటింగ్ ఫ్లాప్

న్యూజిల్యాండ్ బ్యాటింగ్ ఫ్లాప్

బౌలింగ్‌కు పూర్తిగా సహకరిస్తున్న పిచ్‌పై న్యూజిల్యాండ్ బ్యాటింగ్ యూనిట్ తేలిపోయింది. టర్న్, బౌన్స్ కనిపించిన ఈ పిచ్‌పై బంతి గమనాన్ని కెప్టెన్ శాంట్నర్ తప్ప ఎవరూ సరిగా అంచనా వేయలేకపోయారు. దానికితోడు పరమ చెత్త షాట్ సెలెక్షన్ కూడా వారి కొంప ముంచింది. డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్ వంటి ఆటగాళ్లు రివర్స్ స్వీప్ ఆడబోతూ అవుటవడం గమనార్హం. పట్టుదలగా ఆడాల్సిన చోట ఈ జట్టు బ్యాటింగ్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగుల మార్క్ దాటలేదంటేనే వీళ్ల బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

టీమిండియా బౌలింగ్ సూపర్

టీమిండియా బౌలింగ్ సూపర్

లక్నో పిచ్‌పై బ్యాటింగ్ కష్టంగా ఉన్నప్పటికీ.. భారత బౌలింగ్ యూనిట్ శ్రమను తక్కువ అంచనా వేయకూడదు. బంతి టర్న్, బౌన్స్ అవుతుండటంతో భారత స్పిన్నర్లు దాన్ని బాగా వాడుకున్నారు. సరైన చోట బంతులు వేస్తూ కివీస్ బ్యాటింగ్ లైనప్‌ను ధ్వంసం చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు మొత్తం 13 ఓవర్లు వేసి కేవలం 53 పరుగులే ఇవ్వడం గమనార్హం. అదే సమయంలో హార్దిక్ పాండ్యా కూడా చక్కగా బౌలింగ్ చేయగా.. డెత్ ఓవర్లలో మాత్రమే బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Monday, January 30, 2023, 8:15 [IST]
Other articles published on Jan 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+