Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కళ్లే కాదు..కెమెరాలూ తిప్పుకోలేకపోయాయ్: కట్టిపడేసిన మిస్టరీ గర్ల్..బిడ్డ ఎంత బాధపడిందో

Who is this Mystery girl Aarti Bedi spotted during the match between DC and KKR in Mumbai

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఆదివారం ముగిసిన డబుల్ హెడ్డర్స్.. అనూహ్య ఫలితాలను ఇచ్చాయి. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో ఓటమిపాలైన ఢిల్లీ కేపిటల్స్- అద్భుతంగా రిటర్న్ బ్యాక్ అయింది. ప్రత్యర్థి కోల్‌కత నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ చెలరేగారు. జట్టు భారీ స్కోర్ చేయడానికి వారిద్దరి భాగస్వామ్యమే కీలకం. ప్రత్యేకించి- డాషింగ్ ఓపెనర్ వార్నర్ బ్యాటింగ్ గాడిన పడటం ఢిల్లీ కేపిటల్స్‌కు గుడ్ సైన్.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 215 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటర్లు అదరగొట్టారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 93 పరుగులు జోడించారు. మిగిలిన వారందరూ సత్తా చాటడంతో స్కోర్ 200 పరుగులు దాటేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కత నైట్ రైడర్స్ తడబడింది. శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ మాత్రమే రాణించారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. దీనితో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 171 పరుగులే చేయగలిగింది.

కోల్‌కత నైట్ రైడర్స్ ఓటమి ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేసింది. ప్రత్యేకించి- స్టేడియంలో మెరుపులు మెరిపించిన మిస్టరీ గర్ల్‌కు ఈ ఓటమి మింగుడుపడలేదు. తాను అభిమానిస్తోన్న జట్టు ఓటమిపాలు కావడంతో అప్పటిదాకా చిందించిన నవ్వులు, మెరుపులు మాయం అయ్యాయి. కోల్‌కత బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో.. తనతో వచ్చిన బ్యాచ్‌తో ఆమె చేసిన అల్లరి ఒక్కసారిగా సద్దుమణిగింది. కేకేఆర్ బ్యాడ్జ్‌ను స్కర్ట్‌కు తగిలించుకుని బాక్స్‌లో చేసిన సందడికి బ్రేక్ పడింది.

ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్- పేరు ఆర్తీ బేడి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. కేకేఆర్‌కు డైహార్డ్ ఫ్యాన్. ఇదివరకు జరిగిన మ్యాచ్‌లల్లో ఎప్పుడూ కనిపించలేదు గానీ.. ఆదివారం నాడు సాగిన పోరులో తళుక్కున మెరిసింది. ఆమె ఎంతలా ఆకట్టుకుందంటే. చివరికి కెమెరామెన్ కూడా ఆమెపైనే ఎక్కువ సేపు ఫోకస్ పెట్టడం కనిపించింది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద ఆమె ఫొటోలు వైరల్‌గా మారాయి.

Story first published: Monday, April 11, 2022, 13:35 [IST]
Other articles published on Apr 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+