సఫారీలతో టెస్ట్ సిరీస్: భారత్‌కు కొత్త సమస్య.. తర్జన భర్జనలో సెలెక్టర్లు

ఈ నెల 26 నుంచి సౌతాఫ్రికాతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఇందుకుగాను టీమిండియా ఈ నెల 16న సఫారీ గడ్డపై అడుగుపెట్టనుంది. అయితే ఈ పర్యటనకు ముందు భారత్‌కు కొత్త సమస్య వచ్చిపడింది. అదే టీమిండియా వైస్‌కెప్టెన్ ఎంపిక. నిజానికి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడే సెలెక్టర్లు వైస్ కెప్టెన్‌ను కూడా ఎంపిక చేశారు. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న రోహిత్ శర్మకు ఆ బాధ్యతను అప్పగించారు. అయితే అనూహ్యంగా రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడడంతో కథ మొదటికొచ్చింది.

వైస్ కెప్టెన్ రేసులో ఉన్నదెవరు?
త్వరలోనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండడంతో ఇప్పుడు సెలెక్టర్లు వైస్ కెప్టెన్ ఎంపికపై దృష్టి సారించారు. ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు లోకేష్ రాహుల్. అయితే అతనికి రిషబ్ పంత్ నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. వీరితోపాటు ఎంతోకాలంగా జట్టులో ఉన్న చటేశ్వర్ పుజారా పేరు కూడా సెలెక్టర్ల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా కూడా రేసులో ఉన్నారు. అయితే వీరేవరూ కాకుండా ఇన్నిరోజులు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానేకే సెలెక్టర్లు ఆ బాధ్యతను అప్పగించిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.

పరిశీలనలో రాహుల్, పంత్ పేర్లు
టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతను లోకేష్ రాహుల్‌కే అప్పగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా అతనికి పలువురు మాజీలు మద్దతు ఇస్తుండడం కలిసొచ్చే అంశం. కాగా టీమిండియా తరఫున ఇప్పటివరకు 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 35 సగటుతో 2321 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో పంజాబ్‌కు కూడా రాహుల్ కెప్టెన్సీ వహించాడు. అయితే రాహుల్‌కు పంత్ నుంచి పోటీ తప్పేలా లేదు. అతని పేరు కూడా సెలెక్టర్ల పరిశీలనలో ఉందని సమాచారం. ఇప్పటివరకు 25 టెస్ట్‌లు ఆడిన పంత్ 39 సగటుతో 1549 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఢిల్లీని విజయవంతంగా నడిపించడం పంత్‌కు కలిసొచ్చే అంశం.

పుజారా, అశ్విన్, బుమ్రాకు దక్కేనా?
నిజానికి వైస్ కెప్టెన్ రేసులో పుజారా కూడా ఉన్నప్పటికీ ఫామ్‌లో లేకపోవడం అతనికి మైనస్‌గా మారింది. ఇప్పటివరకు 92 టెస్టులు ఆడిన పుజారా 44 సగటుతో 6,589 పరుగులు చేశాడు. అందులో 18 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడం అతనికి మైనస్‌గా మారుతుంది. సుదీర్ఘ కాలంగా జట్టులో కొనసాగుతున్న అశ్విన్, బుమ్రా కూడా ఈ రేసులో ఉన్నారు. ఇప్పటివరకు అశ్విన్ 81 టెస్ట్‌ల్లో 427 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 24 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు.

రహానేనే మళ్లీ వైస్ కెప్టెన్?
బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో రహానే వైస్ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ అతనికే వైస్ కెప్టెన్సీ అప్పగించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు క్రీడా విశ్లేషకులు. గతంలో కోహ్లీ గైర్హాజరీలో రహానే విజయంతంగా టీమిండియాను నడిపించాడు. అతని కెప్టెన్సీలో 6 టెస్టులు ఆడిన భారత్ నాల్గింటిలో గెలిచి 2 డ్రా చేసుకుంది. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు 79 టెస్టులు ఆడిన రహానే 39 సగటుతో 4,795 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications