Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: రోహిత్, కోహ్లీ, బాబర్.. ఈ ముగ్గురిలో ఎవరు డేంజర్?

IND vs PAK: నేడు ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ సెమీ ఫైనల్ కు సులభంగా చేరుకోవాలని భావిస్తోంది.

బాబర్, కోహ్లీ, రోహిత్ పైనే దృష్టి
దాయాదుల పోరులో ఇరు జట్ల ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుత ఫామ్ ను పరిశీలిస్తే టీమిండియాదే పైచేయి. న్యూజిలాండ్ పై ఘోర పరాజయం తర్వాత పాకిస్థాన్ పై ఈ మ్యాచ్ లో గెలవాలని ప్రయత్నిస్తోంది. భారత్, పాక్ జట్లు స్టార్ ఆటగాళ్లలో నిండి ఉన్నాయి. కానీ అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బాబర్ ఆజంపైనే ఉంటుంది. ఈ ముగ్గురు దిగ్గజాలు భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Who is the Biggest Threat in IND vs PAK Rohit Sharma Virat Kohli or Babar Azam

పాకిస్థాన్ పై రోహిత్ ఇలా..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు పాకిస్థాన్ తో 19 మ్యాచ్ లు ఆడాడు. పాకిస్థాన్ పై రోహిత్ శర్మ 51.35 సగటుతో 873 పరుగుల చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్థ సెంచరీలు ఉన్నాయి. 2019 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా మాంచెస్టర్ మైదానంలో పాకిస్థాన్ పై రోహిత్ చేసిన అత్యుత్తమ స్కోరు 140 పరుగులు. అయితే పాకిస్థాన్ పై రోహిత్ టీ20 రికార్డు అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. రోహిత్ 12 మ్యాచ్ లలో 14.11 సగటుతో 127 పరుగులు మాత్రమే చేశాడు.

విరాట్ కోహ్లీ
పాకిస్థాన్ పై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ ఝులిపిస్తాడు. పాక్ తో జరిగిన 16 వన్డేల్లో 52.15 సగటుతో 678 పరుగులు చేసాడు. ఇందులో 3 సెంచరీలు, రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. 2012 ఆసియా కప్ లో పాకిస్థాన్ పై కోహ్లీ చేసిన 183 పరుగులు వన్డేల్లో బెస్ట్ స్కోరు. విరాట్ కోహ్లీ పాకిస్థాన్ తో 11 టీ20 మ్యాచ్ లు కూడా ఆడాడు. టీ-20ల్లో 70.28 సగటుతో 5 అర్థ శతకాలతో 492 పరుగులు చేశాడు.

బాబర్ ఆజం
బాబర్ ఆజం గురించి చెప్పాలంటే.. భారత జట్టుతో జరిగిన వన్డేల్లో ప్రత్యేకంగా ఏమీ రాణించలేకపోయాడు. బాబర్ ఆజం 8 మ్యాచ్ లలో 31.14 సగటుతో 218 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. టీ-20 క్రికెట్ లో కూడా బాబర్ భారత జట్టుపై అంత బాగా రాణించలేదు. 5 టీ-20 మ్యాచ్ లలో బాబర్ 26.25 సగటుతో 105 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థశతకం కూడా ఉంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్.
ప్రత్యామ్నాయం: యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివం దుబే

పాకిస్తాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ ఆఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరిస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది.

Story first published: Sunday, February 23, 2025, 14:31 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+