న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Chennai Super Kings: నా క్లాస్‌లో ఈల వేసింది ఎవరు.. ఎంఎస్ ధోనీకి బుక్కైన కేదార్ జాదవ్!!

Who is that whistling in my class: Captain MS Dhoni asks Chennai Super Kings players

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అయినా ఆ జట్టు ఫ్రాంచైజీ మాత్రం త్వరలో అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు ప్రధాన కారణం కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. ఇక సీఎస్‌కే ఆటగాళ్లలో అప్పుడే సందడి మొదలైంది. సీఎస్‌కే మంగళవారం తమ తాజా జెర్సీకి సంబంధించిన వీడియోను అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

కాలర్‌ ఎగరేస్తున్న ధోనీ:

ఐపీఎల్ 2020 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ధరించే జెర్సీని ఆ జట్టు యాజమాన్యం మంగళవారం విడుదల చేసింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్వయంగా ఈల వేస్తున్న వీడియోని దానికి జత చేసింది. చెన్నై జెర్సీ వేసుకున్న మహీ.. ఈల వేయడమే కాక సహచరులు షేన్ వాట్సన్‌, మురళీ విజయ్, రవీంద్ర జడేజాలతో కలిసి కాలు కదిపాడు. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా సందడి చేశారు. మహీ కాలర్‌ ఎగరేస్తూ వేసిన స్టెప్‌ చెన్నై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియో పోస్టు చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి.

ఈల వేసింది ఎవరు:

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ వీడియో పాటు మరో పోస్ట్ కూడా అభిమానుల కోసం పంచుకుంది. ఆ పోస్టులో మహీ ఒక గదిలో టీచర్‌ మాదిరిగా ఇవతలి వైపు నిలబడి ఉండగా.. అవతలి వైపు అతని సహచరులు బెంచిపై కూర్చొని ఉన్నారు. చెన్నై ఆటగాళ్లు ఫాఫ్ డుప్లెసిస్, మురళీ విజయ్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజాలకి సారథి ఎంఎస్ ధోనీ క్లాస్ తీసుకుంటున్నాడు. మహీ క్లాస్ పీకుతుండగా.. మధ్యలో ఎవరో ఒక విజిల్ వేశారు. దీంతో 'నా క్లాస్‌లో ఈల వేసింది ఎవరు' అని ధోనీ ప్రశ్నించగా.. 'ఈ కుర్రాడే సార్‌' అని కేదార్‌ జాదవ్‌ వైపు మిగిలిన ఆటగాళ్లంతా వేలు చూపిస్తున్నట్లుగా ఉందా చిత్రం. ఈ ఫొటో కూడా నెట్టింట వైరల్ అయింది.

నీడలా వెంటాడుతున్న కరోనా:

నీడలా వెంటాడుతున్న కరోనా:

సీఎస్‌కేను కరోనా నీడలా వెంటాడుతూనే ఉంది. గత నెలలో మొత్తం 13 మంది వైరస్‌ బారిన పడగా.. ఇప్పటికి దీపక్ చాహర్‌తో సహా 12 మంది కోలుకున్నారు. అయితే రుతురాజ్‌ గైక్వాడ్‌కు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ బారిన పడినప్పటి నుంచి లక్షణాలు అంతగా ఏం లేకున్నా..పాజిటివ్‌గా తేలడం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా స్థానంలో జట్టులోకి వస్తాడని ఆశలు పెట్టుకున్న సీఎస్‌కే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పుడు ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముంబైతో తొలి మ్యాచ్:

ముంబైతో తొలి మ్యాచ్:

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లెగ్ దశ వరకే బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. లీగ్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఆడిన అన్ని సీజన్లలోనూ చెన్నై టీమ్‌ని ఎంఎస్ ధోనీ కనీసం ప్లేఆఫ్‌కి చేర్చిన విషయం తెలిసిందే. టోర్నీ చరిత్రలో ఏ జట్టూ ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేరలేదు. అంతేకాదు మూడు ట్రోఫీలు కూడా అందించాడు.

SRH: నా పేరుపై ఉన్న ఆ రికార్డు.. ఏ భారత క్రికెటర్‌కు లేదు: విజయ్‌ శంకర్‌

Story first published: Wednesday, September 16, 2020, 9:55 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X