ఒక్క మ్యాచ్‌తో వైరల్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మిస్టరీ గర్ల్'?
ఐపీఎల్ 2026 సీజన్లో మ్యాచ్‌ల హోరుతో పాటు గ్యాలరీలో మెరిసే అందమైన ముఖాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మే 11న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ యువతి అందరి ఆకర్షించింది. రెడ్ టీ-షర్ట్, బ్లూ డెనిమ్ షార్ట్స్ ధరించి చిరునవ్వుతో పంజాబ్ జట్టును ఉత్సాహపరుస్తున్న ఆమె వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో ఇంతకు ఆ క్యూట్ గర్ల్ ఎవరు అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ శ్రద్ధా సరాఫ్?
పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతు ఇస్తూ స్టేడియంలో సందడి చేసిన ఆ యువతి పేరు శ్రద్ధా సరాఫ్. ఢిల్లీకి చెందిన శ్రద్ధా సరాఫ్ వృత్తిరీత్యా క్వాలిటీ అనలిస్ట్. క్రికెట్ మీద ఉన్న అమితమైన ఇష్టంతో తన ఊరు నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మశాలకు మ్యాచ్ చూడటానికి వచ్చింది. ఆమె తండ్రి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అధికారిగా పనిచేయడంతో శ్రద్ధా సరాఫ్ బాల్యం అంతా ఫ్రాన్స్, అమెరికా, మారిషస్, దుబాయ్ వంటి దేశాల్లో గడిచింది.

పంజాబ్‌తో సంబంధం.. ఫేవరెట్ క్రికెటర్లు వీరే..
శ్రద్ధా సరాఫ్ తల్లిది పంజాబ్‌లోని పాటియాలా. అందుకే ఆమెకు పంజాబీ సంస్కృతి అన్నా, ఆ రాష్ట్ర జట్టు అన్నా చాలా ఇష్టం. ఈసారి పంజాబ్ కింగ్స్ కచ్చితంగా కప్ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ప్లేయర్ల విషయానికి వస్తే.. పంజాబ్ జట్టు నుంచి అర్ష్‌దీప్ సింగ్, కూపర్ కాన్లీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ల ఆటను ఆమె బాగా ఇష్టపడుతుంది. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీకి, మహేంద్ర సింగ్ ధోనీకి ఆమె వీరాభిమాని.
చదువులోనూ ఫస్టే!
శ్రద్ధా కేవలం అందగత్తె మాత్రమే కాదు, మంచి విద్యావంతురాలు కూడా. ఒమన్‌లోని ఇండియన్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన శ్రద్ధా.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రామ్జాస్ కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, కెనడాలోని విక్టోరియా యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది. క్రికెట్‌తో పాటు లాన్ టెన్నిస్, ఫుట్‌బాల్ అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications