Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తల పట్టుకుంటున్న ధోనీ టీమ్.. వజ్రం లాంటి బ్యాటర్‌ను వదులుకున్నారు!

ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించి.. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ప్లేయర్ సమీర్ రిజ్వీ. ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ వదులుకున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు ఢిల్లీకి ఆక్సిజన్‌లా మారాడు. ఇంతకీ ఎవరీ సమీర్ రిజ్వీ? అతని నేపథ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లక్నో కోటలో సమీర్ రిజ్వీ వీరవిహారం
ఏప్రిల్ 1న లక్నోలోని ఇటానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ప్లేయర్ సమీర్ రిజ్వీ అద్బుతంగా రాణించాడు. కష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆదుకుంటూ 47 బంతుల్లోనే నాటౌట్‌గా 70 పరుగులు సాధించాడు. సమీర్ రిజ్వీ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు బాదాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌‌కు గానూ సమీర్ రిజ్వీకి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది.

Who is Sameer Rizvi The Young Hero Who Led Delhi Capitals to Victory Against LSG in IPL 2026

ఇంతకు ఎవరీ సమీర్ రిజ్వీ?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 22 ఏళ్ల సమీర్ రిజ్వీ దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సమీర్ రిజ్వీ దిట్ట. అండర్-23 స్టేట్ ఏ ట్రోఫీలో కేవలం 97 బంతుల్లోనే 201 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో ఏకంగా 20 సిక్సర్లు ఉండటం విశేషం. యూపీ టీ20 లీగ్ తొలి సీజన్లో 491 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు.

సీఎస్కే వదులుకుంది.. ఢిల్లీ ఒడిసిపట్టింది
సమీర్ రిజ్వీ ఐపీఎల్ జర్నీ సీఎస్కేతో ప్రారంభమైంది. 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సమీర్ రిజ్వీని రూ.8.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ అరంగేట్రం చేసిన తొలి బంతికే స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ సీజన్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని విడుదల చేసింది. 2025 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ.95 లక్షలకే సమీర్ రిజ్వీని దక్కించుకుంది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై 25 బంతుల్లో 58 పరుగులు చేసి తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో 2026 సీజన్ కోసం ఢిల్లీ సమీర్ రిజ్వీని రీటైన్ చేసుకుంది.

సీఎస్కేకు ఇప్పుడు పశ్చాత్తాపమేనా?
ఒకప్పుడు కోట్ల రూపాయలు పెట్టి కొన్న సమీర్ రిజ్వీని అతి తక్కువ ధరకే ఢిల్లీ దక్కించుకోవడం.. ఇప్పుడు అతను మ్యాచ్ విన్నర్‌గా మారడం చూస్తుంటే సీఎస్కే యాజమాన్యం తమ నిర్ణయంపై ఖచ్చితంగా పునరాలోచనలో పడి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఈ సీజన్లో సమీర్ రిజ్వీ వెన్నెముకగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి రాబోయే మ్యాచ్‌ల్లో ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.

Story first published: Thursday, April 2, 2026, 13:21 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+