For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kavya Maran VS Preity Zinta: ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్లో రిచ్ ఎవరంటే?

Kavya Maran VS Preity Zinta Networth: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి హావాభావాలతో, ఉత్సాహంతో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. వారు మరెవరో కాదు SRH, PBKS జట్ల యజమానులు కావ్యా మారన్, ప్రీతి జింటా. ము ఖ్యంగా ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు.. వికెట్లు తీసినప్పుడు ఈ ఇద్దరి భామల స్పందనలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మరీ ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తుంటే ఓ వైపు కావ్య మారన్ ఆనందంలో.. మరోవైపు ప్రీతి జింటా టెన్షన్ లో క్యూట్ క్యూట్ గా ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కావ్య పాప - ప్రీతి జింటా మధ్య ఎవరు ధనవంతులు, వారి నెట్ వర్త్ ఎంత వంటి విషయాలను కూడా చర్చకు వచ్చాయి.

పంజాబ్ కింగ్స్ కు పలువురు ఓనర్లు ఉండగా.. వారిలో ప్రధానంగా వినిపించే పేరు ప్రీతి జింటా. ముందుగా ప్రీతి జింటా విషయానికొస్తే.. ఆమె 1998లో విడుదలైన దిల్‌ సేతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి.. సినీప్రియుల మది దోచింది. 'ప్రేమంటే ఇదేరా', 'రాజ కుమారుడు' వంటి చిత్రాలతో తెలుగువారికి కూడా చేరువైంది. అయితే ఇప్పుడామె సినిమాలకు దూరంగా ఉంటోంది. 2018లో విడుదలైన 'భయాజీ సూపర్‌హిట్‌' తర్వాత నుంచి ఆమె నటించలేదు.

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ క్రికెట్ వ్యవహారాలను చూసుకుంటోంది. కో ఓనర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఆమెకు ప్రధాన ఆదాయం ఫిల్మ్ ప్రొడక్షన్ నుంచే వస్తుంది. ఇదే కాకుండా బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా బానే ఆర్జిస్తోంది. కనీసం రూ.1.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంటుంది. ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం.. ప్రీతి జింటా నెట్ వర్త్ రూ.183 కోట్లు. ఇది కేవలం అంచనా మాత్రమే. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చని సమాచారం. ఆమె ఐపీఎల్ టీమ్ (పంజాబ్ కింగ్స్) వ్యాల్యూ రూ.900 కోట్లు. టోర్నమెంట్ షురూ అయినప్పటి నుంచి పంజాబ్ ఫ్రాంఛైజీ కొనసాగుతోంది. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ దక్కించుకోలేదు.

who is richer SRH VS PBKS owners Kavya Maran and Preity Zinta Networth full details

కావ్య మారన్ ఆస్తి ఎంతంటే?
సన్‌రైజర్స్ హైదరాబాద్.. సన్ గ్రూ‌ప్‌నకు చెందిన ఫ్రాంఛైజీ. సన్ గ్రూప్ విలువ రూ.24వేల కోట్లు ఉంటుందని సమచారం. కావ్య మారన్ పర్సనల్ ప్రాపర్టీ నెట్ వర్త్ రూ.410 కోట్లకుపైగా ఉంటాయని ఇంగ్లీష్ కథనాల్లో రాసి ఉంది. భారత్ లో అత్యంత సంపద కలిగిన యువ పారిశ్రామికవేత్తలో ఆమె ఒకరు. సన్ రైజర్స్ బ్రాండ్ వ్యాల్యూ రూ.3000 వేల కోట్లు ఉంటుందని సమాచారం.

ఐపీఎల్ రిచెస్ట్ ఓనర్ ఎవరంటే?
ఈ లెక్కన చూస్తే ప్రీతి జింటా కన్నా కావ్యా మారన్ అత్యధిక ధనవంతురాలు. అయితే ఐపీఎల్ లో రిలయన్స్ గ్రూప్ నకు చెందిన ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఓనర్ నీతా అంబానీ నెట్ వర్త్ రూ.34 వేల కోట్లు ఉంటుందని అంచనా. మొత్తానికి తాజాగా జరిగిన SRH-PBKS మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా, మైదానంలో ఉన్న యజమానుల హావాభావాలు పరంగా కూడా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది

Story first published: Sunday, April 13, 2025, 12:53 [IST]
Other articles published on Apr 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+