Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: RCB భవిష్యత్తు కెప్టెన్ ఆయనే..!

IPL: ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ జట్టు తమ భవిష్యత్ కెప్టెన్‌కు సంబంధించి ఓ కీలక హింట్ ఇచ్చింది. ఆర్సీబీకి వరుసగా రెండు ఐపీఎల్ ట్రోఫీలను అందించి.. కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న రజత్ పాటిదార్ కంటే ప్రస్తుత స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వయసులో 8 ఏళ్లు చిన్నవాడు. ప్రస్తుతం 25 ఏళ్ల వయసున్న దేవదత్ పడిక్కల్ ఇంకా తన కెరీర్ పీక్ స్టేజ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో రజత్ పాటిదార్ తర్వాత ఆర్సీబీ జట్టును నడిపించే సత్తా పడిక్కల్ కు ఉందని ఆ ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ అభిప్రాయపడ్డారు.

దేవదత్ పడిక్కల్‌పై ప్రశంసల జల్లు
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ రెండోసారి వరుసగా టైటిల్ గెలవడంలో దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్.. 15 ఇన్నింగ్స్‌ల్లో 168.72 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 464 పరుగులు సాధించాడు. గత కొన్ని సీజన్లలో ఫామ్ కోసం ఇబ్బంది పడినప్పటికీ.. మళ్లీ తన సొంత నగరమైన బెంగళూరు ఫ్రాంచైజీలోకి వచ్చాక పడిక్కల్ ఫామ్ అందుకొని పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో ఆర్సీబీకి భారీ స్కోర్లు అందించాడు. దేవదత్ పడిక్కల్ ప్రదర్శనపై ఆర్సీబీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్లోని 'RCB's Trophy Quest' డాక్యుమెంటరీలో మో బోబాట్ ప్రత్యేకంగా మాట్లాడారు.

Who is RCB Next Captain Franchise Drops Massive Hint on Rajat Patidar Successor Full Details

భవిష్యత్తు కెప్టెన్ అతనే..
ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అందించిన మెరుపు ఆరంభాన్ని అదే జోరుతో ముందుకు తీసుకెళ్లాలని తాము పడిక్కల్‌కు సూచించామని.. దానికి తగ్గట్టుగానే పడిక్కల్ ఎంతో నిస్వార్థంగా బ్యాటింగ్ చేశాడని మో బోబాట్ కొనియాడారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా పడిక్కల్ వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన వెల్లడించారు. పడిక్కల్‌లో భవిష్యత్తులో ఓ గొప్ప కెప్టెన్ అయ్యే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బోబాట్ స్పష్టం చేశారు. ఆర్సీబీతో ఇప్పటికే 5 ఐపీఎల్ సీజన్ల అనుభవం ఉన్నపడిక్కల్.. రాబోయే రోజుల్లో జట్టుకు సహజసిద్ధమైన కెప్టెన్సీ ఎంపికగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

దినేష్ కార్తీక్ ప్రశంసలు
ఆర్సీబీ మెంటార్, బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ కూడా దేవదత్ పడిక్కల్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ జట్టులో బెంగళూరుకు చెందిన లోకల్ ప్లేయర్ కావడం పడిక్కల్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ అని దినేష్ కార్తీక్ అన్నారు. పడిక్కల్ పక్కా బెంగళూరు లోకల్ బాయ్ అని.. ఈ వయసులోనే మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా గేమ్‌ను మార్చడంలో పడిక్కల్ అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నాడని కొనియాడారు. ఆర్సీబీ యాజమాన్యం, కోచింగ్ స్టాఫ్ నుంచి వస్తున్న ఈ సంకేతాలను బట్టి చూస్తే.. రజత్ పాటిదార్ తర్వాత ఆర్సీబీ పగ్గాలు దేవదత్ పడిక్కల్ చేతికి వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Friday, June 26, 2026, 9:31 [IST]
Other articles published on Jun 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+