న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే బౌలర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం: ఎవరీ రషీద్ ఖాన్

By Nageshwara Rao
Who is Rashid Khan? Shahid Afridi fan breaks ICC record previously held by Sachin Tendulkar and Sir Don Bradman

హైదరాబాద్: మంగళవారం ఐసీసీ ప్రకటించిన వన్డే బౌలర్ ర్యాంకుల్లో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ బుమ్రాతో కలిసి ఆప్ఘనిస్థాన్‌కు చెందిన స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

పాకిస్థాన్ ఆటగాడు సక్లయిన్ ముస్తాక్ పేరిట ఉన్న 21 ఏళ్ల రికార్డుని రషీద్ ఖాన్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ వయసు 19 ఏళ్ల 152 రోజులు. జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో రషీద్ ఖాన్ మొత్తం 16 వికెట్లు తీయడంతో ఆప్ఘనిస్థాన్ 4-1తో సిరిస్‌ను కైవసం చేసుకుంది.

ఈ సిరిస్‌లో రషీద్ ఖాన్ అటు బంతితో పాటు బ్యాట్‌తో కూడా మెరిశాడు. షార్జా వేదికగా జరిగిన ఈ సిరిస్‌లో రషీద్ ఖాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 51 పరుగులు చేశాడు. సోమవారం జరిగిన జింబాబ్వేతో జరిగిన ఫైనల్లో 43 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఎవరీ రషీద్ ఖాన్?

ఎవరీ రషీద్ ఖాన్?

రషీద్ ఖాన్ సెప్టెంబర్ 20, 1998లో ఉత్తర ఆప్ఘనిస్థాన్‌లోని నంగర్గర్ ప్రాంతంలో జన్మించాడు. రషీద్‌కు 10 మంది తోబుట్టువులు ఉన్నారు. తన చిన్నతనంలో ఆప్ఘనిస్థాన్‌లో యుద్ధం జరగడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు గాను అక్కడ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లారు. కొన్ని సంవత్సరాల పాటు పాకిస్థాన్‌లోనే నివసించిన రషీద్ కుటుంబం ఆప్ఘన్ యుద్ధం ముగిసే సరికి తిరిగి ఆప్ఘనిస్థాన్‌కు వచ్చింది.

షాహిద్ అఫ్రిదీకి వీరాభిమాని

షాహిద్ అఫ్రిదీకి వీరాభిమాని

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి వీరాభిమాని. 37 ఏళ్ల వయసులో కూడా అఫ్రిదీ రాణించిన తీరు ఇప్పటికీ తనను ఆశ్చర్యానికి గురి చేస్తుంటుందని రషీద్ ఒక సందర్భంలో చెప్పాడు. అంతేకాదు అఫ్రిదీని రోల్ మోడల్‌గా తీసుకుని కెరీర్‌లో సక్సెస్ కావాలని అతడిని అనుకరించాడు. 'వయసు పెరుగుతున్న కొద్దీ అఫ్రిదీకి వీరాభిమాని అయ్యా. ఆప్ఘన్-పాకిస్థాన్ బోర్డర్‌లోని ట్రైబల్ ప్రాంతానికి చెందినవాడు. నేను అతడిని చూశా. అతడిని చదివా కూడా. ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌పై అతడు చూపించే దూకుడంటే నాకెంతో ఇష్టం. అందుకే అతడు సక్సెస్ అయ్యాడు' అని రషీద్ అన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం

అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం

తన 17వ పుట్టినరోజు ముగిసిన కొద్ది నెలలకే అక్టోబర్ 18, 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బలువాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రషీద్ 10 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఆప్ఘనిస్థాన్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆప్ఘన్ తరుపున రషీద్ ఖాన్ ఇప్పటివరకు 37 వన్డేలాడి 86 వికెట్లు తీయగా, 29 టీ20ల్లో 47 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు

అంతర్జాతీయ క్రికెట్‌లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శనను చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2017 సీజన్ కోసం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రషీద్ ఖాన్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్‌లో అమ్ముడైన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆ సీజన్‌లోనే రషీద్ ఖాన్‌తో పాటు ఆప్ఘన్‌కు చెందిన మహమ్మద్ నబీని కూడా సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో రషీద్ ఖాన్ మొత్తం 14 మ్యాచ్‌లాడి 17 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2017లో రషీద్ కాన్ ఎకానమీ రేట్ 6.62గా ఉంది.

Story first published: Wednesday, February 21, 2018, 14:25 [IST]
Other articles published on Feb 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X