ప్రియా ప్రకాశ్ వారియర్ ఫేవరేట్ క్రికెటర్ కోహ్లీ కాదా..?

హైదరాబాద్: ప్రియా ప్రకాశ్ వారియర్ తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో బయటపెట్టింది. ఒక్క వీడియోతో క్లిప్‌తో ఫేమస్ అయిపోయిన ప్రియా సెలబ్రిటీగా మారిపోయింది. వరుస ఇంటర్వ్వూలతో బిజీబిజీగా కాలం గడుపుతోంది. అయితే ఈ మధ్యనే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించింది. కోహ్లీ అంతగా ఫేవరేట్ కాదంటూ ఆ స్థానాన్ని మహేంద్ర సింగ్ ధోనీకి ఇచ్చేసింది.
రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈమెను పోలుస్తూ రజనీకాంత్ నుంచి దక్షిణాఫ్రికా బౌలర్ల వరకు పేరడీ వీడియోలు చేస్తూనే ఉన్నారు. రంగాల వారీగా ఈమె వీడియోను వాడుకుంటూ సోషల్ మీడియాలో బీభత్సంగా లైక్‌లు సంపాదించుకుంటున్నారు నెటిజన్లు.
'ఒరు అదార్ లవ్' చిత్రంలోని 'మాణిక్య మలరాయ పూవి' పాటతో ఒక్కసారిగా అందర్నీ తనవైపు తిప్పుకొంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. కనుసైగలతోనే ఏదో కొంత మాయే చేసింది.
ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్‌గా పేరు తెచ్చుకున్న ధోనీ 36 ఏళ్ల వయస్సులోనూ యువ హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌లో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా 24 గంటల్లో ఫాలోవర్లను పెంచుకున్న వారి జాబితాలో క్రిస్టియన్ రొనాల్డో 6 లక్షలు, కైలి జెన్నర్ 8లక్షలు ఆరు వేలు సంపాదించుకుని రికార్డులకెక్కారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications