Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్ బ్యూటీఫుల్ సిస్టర్ - ఆ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగియడంతో స్వదేశానికి చేరుకున్న టీమిండియా ప్లేయర్లంతా.. ఒక్కోక్కరిగా పంత్ ఇంటికి చేరుకున్నారు. సునీల్ గావస్కర్, ధోనీ, రైనా సహా పలువురు మాజీ ప్లేయర్లంతా కూడా పంత్ ఇంటికి చేరుకుని చిందులేస్తూ సరదాగా గడిపారు. అందుకు కారణంగా పంత్ సోదరి సాక్షి పంత్ పెళ్లి వేడుకలు. ఆమె తన సోదరుడు పంత్ లా పబ్లిక్ ఫిగర్ కాకపోయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మాత్రం సంపాదించుకుంది. అయితే సాక్షి పంత్ పెళ్లి వార్త గురించి తెలియడంతో చాలా మంది క్రికెట్ అభిమానులు ఆమె గురించి తెలుసుకునేందుకు, ఆమె ఎలా ఉంటుందో చూసేందుకు ఆరాటపడుతూ, ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి పంత్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

యూకేలోని హెర్ట్ ఫోర్డ్‌షైర్ యూనివర్సిటీ నుంచి సాక్షి పంత్ ఎంబీఏ డిగ్రీ పట్టా పొందింది. కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని పట్టుదలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆమె యూకేలో తన కెరీర్ ను అద్భుతంగా నిర్మించుకుంది. ఇప్పుడు నేషనల్ ఫార్మసీ అసోసియేషన్ తో కలిసి పనిచేస్తోంది.అంతకుముందు లిస్టర్ హాస్పిటల్ లాంటి పలు పెద్ద సంస్థల్లోనూ పని చేసింది.

Who is Pant Sister Sakshi Pant Set To Marry London-Based Businessman full details
Photo Credit: sakshi pant insta

సోషల్ మీడియా క్రేజ్..
సాక్షి పంత్ కు ఇన్ స్టాలోనూ ఫుల్ ఫాలోయింగ్ క్రేజ్ ఉంది. ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్. అలానే ఎప్పుడూ తన స్టైలిష్ లైఫ్ స్టైల్, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి గడిపిన హార్ట్ ఫుల్ మూమెంట్స్ ను షేర్ చేస్తుంటుంది. ఆమెకు దాదాపు 200కేకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

పంత్ కు తోడుగా..
సాక్షి.. తన సోదరుడు రిషభ్ పంత్ కు ఎప్పుడూ అండగా, తోడుగా నిలుస్తుంటుంది. తన తండ్రిని కోల్పోయిన సమయంలో కుటుంబానికి అండగా నిలిచింది. ముఖ్యంగా రిషభ్ కు భారీ రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో అతడు కోలుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది. పంత్ కు బలంగా నిలిచింది. ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా తోడుగా నిలిచింది.

అతడితో పెళ్లి..
సాక్షి..లండన్ బిజినెస్ మెన్ అంకిత్ చౌదరిని పెళ్లి చేసుకోనుంది.దాదాపు 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. అంకిత్.. విద్యా, పర్యావరణంకు సంబంధించి చొరవ తీసుకుని పలు కార్యక్రమాలు చేసే ఎలైట్ 2 కంపెనీలో బోర్డ్ మెంబర్ గా ఉన్నారు. వీరి పెళ్లి ఓ లగ్జరీ హోటల్ లో జరగనుంది. ఈ పెళ్లికి స్టార్ క్రికెటర్లంతా హాజరుకానున్నారు.


క్రికెట్ అభిమానులకు స్ఫూర్తిగా..
ఇంత విజయం సాధించినప్పటికీ ఎప్పుడూ తన కుటంబంతోనే ఉంటూ వారికి అండగా నిలుస్తుంది సాక్షి. ఆమె పంత్ తో కొనసాగించే క్లోజ్ బాండ్.. ఎంతో మంది క్రికెట్ అభిమానులను ఇన్‌స్పైరింగ్ చేస్తూనే ఉంటుంది.
Story first published: Wednesday, March 12, 2025, 11:11 [IST]
Other articles published on Mar 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+