Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

20,30 కాదు.. ముసలి వయసులో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం - అసలు ఎవరితను?

సాధారణంగా ఏ క్రీడల్లోనైనా దాదాపుగా 30 ఏళ్లలోపే అరంగేట్రం చేస్తుంటారు ఆటగాళ్లు. అదే 60 వచ్చిందంటే కచ్చితంగా అప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేసి ఇతర దాంట్లో కొనసాగుతుంటారు. 60 ఏళ్ల వయసులో ప్రస్తుతం కోచ్ లు కూడా పెద్దగా కనపడట్లేదు. కానీ తాజాగా ఓ క్రికెటర్ ఏకంగా 62ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు.

అతడెవరంటే?
అది 2025 మార్చి 10. ఆ రోజు గ్వాసిమా వేదికగా ఫాల్కాలాండ్ ఐలాండ్ వర్సెస్ కోస్టారికా మధ్య అంతర్జాతీయ టీ20 జరిగింది. ఆ మ్యాచ్ తో ఫాల్క్‌లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు మాథ్యూ బ్రౌన్లీ. తద్వారా క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. 62 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన క్రికెటర్ గా నిలిచాడు. మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అరంగేట్రం చేసిన అతి పెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు. టర్కీకి చెందిన ఒస్మాన్‌ గోకర్‌ (59 ఏళ్లు) రికార్డును బ్రేక్ చేశాడు. మాథ్యూ.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివరకు మూడు టీ20ల్లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడి 6 పరుగులు చేశాడు. అందులో రెండు ఇన్నింగ్స్‌లో నాటౌట్ గా నిలిచాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసినప్పటికీ ఇంకా వికెట్ తీయలేదు.

Matthew Brownlee Becomes Oldest cricketer to Make International Debut at age 62
Photo Credit: twitter screenshots

బ్రౌన్లీ మాత్రం భిన్నంగా..
క్రికెట్ ప్రపంచంలో చాలా మంది ఆటగాళ్లు అతి తక్కువ వయస్సులోనే ఆట నుంచి రిటైర్ అవుతుంటే, బ్రౌన్లీ మాత్రం పెద్ద వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని ప్రశంసిస్తున్నారు. ఇది యువ క్రికెటర్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆటపట్ల బ్రౌన్లీకి ఉన్న శ్రమ, పట్టుదలు, అంకితభావమే ఇందుకు కారణమని కొనియాడుతున్నారు

Story first published: Tuesday, March 18, 2025, 8:36 [IST]
Other articles published on Mar 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+