ముంబై టెస్టు: తొలి టెస్టులో సెంచరీ, ఎవరీ కీనట్ జెన్నింగ్స్
హైదరాబాద్: కీనట్ జెన్నింగ్స్. అంతర్జాతీయ ముంబై టెస్టుతో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 19వ అటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ముంబై స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
2006లో ఇంగ్లాండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే వాంఖడె స్టేడియంలో ఇప్పటివరకూ అరంగేట్రం చేసిన క్రికెటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. తాజాగా గురువారం భారత్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో జెన్నింగ్స్ ఆ రికార్డుని అధిగమించాడు.
దీంతో ఎవరీ కీనట్ జెన్నింగ్స్ అనే ప్రశ్న యావత్ క్రీకెట్ అభిమానులను తొలుస్తుంది. జెన్నింగ్స్ ఎవరో కాదు దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రే జెన్నింగ్స్ కుమారుడే. జెన్నింగ్స్ తల్లి సండర్లాండ్‌కు చెందినది. 2011లో దక్షిణాఫ్రికాతో జరిగిన అండర్ 19 వన్డేలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
దక్షిణాఫ్రికా సంతతికి చెందిన జెన్నింగ్స్ డిసెంబర్ 2011లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. సెకెండ్ ఎలెవన్ మ్యాచ్‌ల్లో జెన్నింగ్స్ తొలిసారి 1,319 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఆగస్టు 2012లో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో సుర్రే జట్టుపై 70 పరుగులు నమోదు చేశాడు.

అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా జెన్నింగ్స్
ఆ తర్వాత కౌంటీ మ్యాచ్‌ల్లో అమోఘమైన పరుగుల రికార్డును నెలకొల్పాడు. 2016లో ఏకంగా 1,548 కౌంటీ పరుగులు సాధించాడు. తద్వారా కౌంటీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా జెన్నింగ్స్ గుర్తింపు పొందాడు. కౌంటీల్లో అత్యధిక సెంచరీలు (7) రికార్డు కూడా జెన్నింగ్స్ పేరిట ఉంది.

కౌంటీల్లో యార్కేషైర్‌పై జెన్నింగ్స్ డబుల్ సెంచరీ
కౌంటీల్లో యార్కేషైర్‌పై జెన్నింగ్స్ డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన జెన్నింగ్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 35.89 యావరేజితో 16 అర్ధ సెంచరీలు, 12 సెంచరీలు నమోదు చేశాడు. 2013లో కంట్రీ ఛాంపియన్స్ షిప్ ప్లేయర్ అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు.

అరంగేట్రం మ్యాచ్‌లో 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లాండ్ ఆటగాడు
తాజాగా ముంబై టెస్టులో జెన్నింగ్స్ ఆటతీరుకు మాజీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్‌లో 2006 నుంచి చూస్తే అరంగేట్రం మ్యాచ్‌లో 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లాండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడు ఆ తర్వాత వచ్చి భారత్‌లో 50 పైగా పరుగులు సాధించిన ఇంగ్లాండ్ అరంగేట్ర ఆటగాళ్లలో అలెస్టర్ కుక్, ఓవై షా, రూట్, హమిద్ లున్నారు.

186 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ
ఓపెనర్ హాసీబ్ హామీద్ స్ధానంలో జట్టులో చోటు దక్కించుకున్న జెన్నింగ్స్ ముంబై టెస్టులో అలెస్టర్ కుక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన జెన్నింగ్స్ చక్కటి శుభారంభానిచ్చాడు. ముఖ్యంగా భారత పేసర్లతో పాటు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని 186 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో నాలుగో టెస్టులో తొలి రోజు ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications