Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ కొడుకు, జస్టిన్ బీబర్.. అచ్చు కవల పిల్లల్లాగే

ముంబై : మనుషులను పోలిన మనుషులు ఉంటారని వినుంటాం గానీ.. ఆ మనుషులిద్దరు సెలబ్రిటీలు అయితే జనాలు తికమకపడిపోరూ! ఇప్పుడీ సందేహం ఎందుకంటే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కు దగ్గరి పోలికలు ఉండడమే.

అర్జున్ తాజా ఫోటోలను చూసిన ఎవరైనా సరే ఈ సందేహం వ్యక్తం చేయకమానరు. వీరిద్దరేమైనా కవలల పిల్లల అన్న తరహాలో అర్జున్ కు బీబర్ కు మధ్య అచ్చు గుద్దినట్టు పోలికలు ఉండడం విశేషం. ఇంతకీ ఈ విషయమెలా హైలైట్ అయిందంటే.. సెప్టెంబర్ 24వ తేదీన అర్జున్ 17వ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు జరుపుకున్నాడు అర్జున్.

 Who is it really? Arjun Tendulkar or Justin Bieber?

అనంతరం తండ్రి సచిన్ తో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. అర్జున్ చూసి చాలామంది నెటిజెన్స్ జస్టిన్ బీబర్ అనుకుని పొరపాటు పడ్డారు. బీబర్ సచిన్ ను ఎప్పుడు కలిశాడు? లేక బీబర్-అర్జున్ చిన్నప్పుడే తప్పిపోయిన కవల సోదరులా? అంటూ రకరకాల సందేహాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు నెటిజెన్స్. అంతలా అర్జున్-బీబర్ ఇద్దరూ దగ్గరి పోలికలను కలిగున్నారు మరి.

ఇక ఇంకొంతమంది నెటిజెన్స్ అయితే.. టీవీలో వచ్చే యాడ్ తరహాలో వీరిద్దరిని 'సురేశ్-రమేశ్' అంటూ సరదా కామెంట్లు చేయడం చేశారు. ఏదేమైనా మాస్టర్ బ్లాస్టర్ తనయుడు జస్టిన్ బీబర్ ను పోలి ఉండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+