ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా సాగుతోన్న ఈ తుది సమరంలో కేరళ - విదర్భ హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడీ రంజీ ట్రోఫీ ఫైనల్ తో మరో కొత్త యంగ్ స్టార్ పుట్టుకొచ్చాడు. అతడే డానిష్ మలేవార్. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ లో అదిరే ప్రదర్శనతో అందరి దృష్టి ఆకట్టుకున్న అతడు... ఇప్పుడు ఫైనల్ లోనూ కళ్లు చెదిరే ప్రదర్శన చేస్తున్నాడు. తాజాగా సూపర్ సెంచరీతో ప్రత్యర్థి జట్టుపై చెలరేగాడు. దీంతో ఇప్పుడు అందరూ అతడి గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.
క్వార్టర్, సెమీఫైనల్ లో హాఫ్ సెంచరీ..
రీసెంట్ గానే డానిష్ మలేవార్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ లో తమిళనాడుపై (75, డక్) హాఫ్ సెంచరీ బాది మెరిశాడు. ఆ తర్వాత సెమీ ఫైనల్ లోనూ ముంబయి జట్టుపై (79,29) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కేరళతో ఆడనున్న ఫైనల్ లో అతడిపై అంచనాలు కాస్త పెరిగాయి. అందుకు తగ్గట్టే ఇప్పుడు అతడు శతకంతో చెలరేగి ప్రదర్శన చేశాడు.

ఇంతకీ డానిష్ మలేవార్ ఎవరంటే?
ఇప్పటివరకు అతడు 2024-25 రంజీ సీజన్ లో 14 ఇన్నింగ్స్ లో 52.74 సగటుతో 673 పరుగులు చేశాడు. తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లోనూ మంచి బ్యాటింగ్ టెక్నిక్స్ తో నిలకడగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. అయితే డానిష్ మలేవార్ తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం.. ఈ రంజీ సీజన్ ఫస్ట్ హాఫ్ లో ఆంధ్ర జట్టుపై చేశాడు. అలా వచ్చీ రాగానే అతడు తన రెండో ఇన్నింగ్స్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 61 పరుగులు చేశాడు. అనంతరం 56,42,59 వరుసగా మూడు ఇన్నింగ్స్ లో బాదాడు. ఈ క్రమంలోనే తన ఫస్ట్ క్లాస్ హండ్రెడ్ ను (115) గుజరాత్ పై బాదాడు.
మా నాన్న ఎంతో కష్టపడి..
డానిష్ విదర్భ నాగ్ పూర్ లో జన్మించాడు. అతడు తండ్రి పేరు విష్ణు. ఆయన క్రికెట్ అభిమాని. తనకు పెళ్లి అయినప్పుడు కొడుకు పుడితే అతడిని క్రికెటర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టే కొడుకును క్రికెట్ వైపు నడిపిస్తూ ప్రోత్సాహిస్తున్నాడు.
"మా నాన్న నేను క్రికెటర్ అవ్వాలని ఎప్పుడూ కలలు కనేవాడు. అలా నేను నా ఏడేళ్ల వయసులో అకాడమీలో చేరాను. మా నాన్న ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూనే నన్ను క్రికెట్ వైపు నడిపించాడు. క్రికెట్ కు సంబంధించి నాకు కావాల్సినవి సమకూర్చాడు. నా జూనియర్ డేస్ లో కొంతమంది వాళ్లు వాడిన బ్యాట్స్, ప్యాడ్స్, గ్లోవ్స్ కూడా ఇచ్చేవారు. నేను అండర్ 19లోకి వచ్చాకే నాకు డబ్బు రావడం మొదలైంది అని మలేవార్" చెప్పుకొచ్చాడు. కాగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాగ్ పూర్ వేదికగానే జన్మించిన సంగతి తెలిసిందే. ఈ నాగ్ పూర్ అటు విదర్భ, ఇటు మహారాష్ట్ర.. రెండింటిలోనూ భాగమే.
- Fifty in Quarter Final in Ranji.
— Johns. (@CricCrazyJohns) February 26, 2025
- Fifty in Semi Final in Ranji.
- Hundred in Final in Ranji.
A NEW STAR HAS ARRIVED, ITS 21-YEAR-OLD FROM VIDARBHA - DANISH MALEWAR 🙇 pic.twitter.com/nfMYiNS5N8
21-YEAR-OLD DANISH MALEWAR SCORED A HUNDRED IN RANJI TROPHY FINAL 🔥🙇 pic.twitter.com/ek3dXzASTB
— Johns. (@CricCrazyJohns) February 26, 2025