Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK: రైనా లేడుగా.. ఈసారి వైస్‌ కెప్టెన్‌ ఎవరు? నెటిజన్‌కు అదిరే పంచ్ ఇచ్చిన సీఎస్‌కే!!

Who is Chennai Super Kings vice captain now: CSK respond to fan query after Suresh Raina pulls out of IPL 2020
IPL 2020 : Fan Asks About CSK's Vice-Captain? CSK’s ‘Wise’ Reply...!! || Oneindia Telugu

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో కలిసి యూఏఈకి వెళ్లిన సురేశ్ రైనా.. గత శుక్రవారం టోర్నీ నుంచి తప్పుకున్నాడు. క్వారంటైన్ సమయంలో హోటల్ గది విషయంలో అసంతృప్తిగా ఉన్నాడని, చెన్నై టీమ్‌‌లో గతవారం 13 మంది కరోనా వైరస్ బారినపడటంతో.. ఆ భయంతోనే రైనా స్వదేశానికి వచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే స్వదేశానికి తిరిగొచ్చానని తాజాగా రైనా స్పష్టం చేశాడు. వీలైతే మళ్లీ జట్టులో కలుస్తానని కూడా వెల్లడించాడు. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం మాత్రం లేదు.

తెలివైన కెప్టెన్ ఉన్నాడుగా

తెలివైన కెప్టెన్ ఉన్నాడుగా

సురేశ్ రైనా స్వదేశానికి రావడంతో ఓ అభిమాని ట్విటర్‌లో సీఎస్‌కేను ఒక ఆసక్తికర ప్రశ్న వేశాడు. ఈసారి మన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌ ఎవరని అడిగాడు. దానికి స్పందించిన సీఎస్‌కే మజమాన్యం సదరు అభిమానికి అదిరేలా పంచ్ ఇచ్చింది. మనకు తెలివైన కెప్టెన్ (Wise Captain) ఎంఎస్ ధోనీ ఉండగా.. ఇక భయమెందుకు? అని తిరిగి ప్రశ్నించింది. వైస్‌ కెప్టెన్‌ లేకున్నా.. సారథి ధోనీ అన్ని విషయాలు చూసుకుంటాడని సీఎస్‌కే మజమాన్యం చెప్పకనే చెప్పింది.

కుటుంబం కోసమే

కుటుంబం కోసమే

తనపై వచ్చిన వార్తలపై స్పందించిన సురేష్ రైనా గురువారం ఓ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన కుటుంబంతో ఉండడమే శ్రేయస్కరమని భావించి తిరిగి భారత్ వచ్చినట్లు చెప్పాడు. 'కుటుంబం కోసమే తిరిగి రావాలని నిర్ణయించుకున్నా. నేను దగ్గరుండి చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సీఎస్‌కే కూడా నా కుటుంబమే. మహీ భాయ్‌ నాకెంతో ముఖ్యమైన వ్యక్తి. ఈ నిర్ణయం చాలా కఠినమైందే. సీఎస్‌కే, నాకూ మధ్య ఎలాంటి వివాదం లేదు. గట్టి కారణం లేకుండా ఎవరూ రూ.12.5 కోట్లు వదులుకోరు. అంతర్జాతీయ క్రికెట్‌కు నేను వీడ్కోలు పలికి ఉండొచ్చు. కానీ నాకింకా వయసుంది. శ్రీనివాసన్‌ నాకు తండ్రిలాంటి వారు. నన్నాయన చిన్న కొడుకులా చూసుకుంటారు' అని రైనా స్పష్టం చేశాడు.

రీఎంట్రీ నా చేతుల్లో లేదు

రీఎంట్రీ నా చేతుల్లో లేదు

రైనా వ్యాఖ్యలపై శ్రీనివాసన్‌ స్పందిస్తూ... సురేష్ రైనా చెప్పింది నిజమేనని, అతనిని తన సొంత కొడుకు లాగా చూసుకున్నట్లు తెలిపారు. ఐపీఎల్‌లో రైనా ఆడాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్రకు శ్రీనివాసన్‌ స్పందిస్తూ... తాము టీమ్‌ను మాత్రమే ఫ్రాంచైజీగా (కొనుగోలు) తీసుకున్నామని, ఆటగాళ్లను కాదన్నారు. 'నేను చెన్నై జట్టుకు కెప్టెన్‌ను కాదు. ఎవరిని మ్యాచులో ఆడించాలో, ఎవరిని వేలంలో తీసుకోవాలో అని టీమ్‌ మేనేజ్మెంట్, కెప్టెన్‌కు ఎప్పుడూ చెప్పలేదు. సీఎస్‌కేకు అద్భుతమైన కెప్టెన్‌ ఉన్నాడు. ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌ అన్ని చూసుకుంటాడు' అని శ్రీనివాసన్‌ చెప్పారు.

సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లు

సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్‌లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2008 నుంచీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫునే ఆడుతున్న రైనా.. మధ్యలో కొచ్చి టస్కర్స్ తరఫున రెండు సీజన్లు ఆడాడు. రైనా సీఎస్‌కే తరఫున 164 మ్యాచ్‌లాడి.. అత్య‌ధిక మ్యాచ్‌లాడిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో సీఎస్‌కే మొత్తంగా 165 మ్యాచ్‌లు ఆడగా.. రైనా 164 మ్యాచ్‌లు ఆడాడు. కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్‌ను రైనా ఆడలేదు. అదికూడా 2018లో కాలి పిక్క గాయం కార‌ణంగా బరిలోకి దిగలేదు.

Story first published: Thursday, September 3, 2020, 12:55 [IST]
Other articles published on Sep 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+