IPL 2023: వీళ్లుంటే బంతి బౌండరీని తాకదు..!
టీ20 ఫార్మట్ లో ప్రతి ఒక్క పరుగు ముఖ్యమే.. అయితే ప్రత్యర్థలు పరుగులు చేయకాడదంటే.. బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా బలంగా ఉండాలి. ఫీల్డింగ్ అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఫీల్డింగ్ లో చిన్న తప్పు మ్యాచ్ గతినే మార్చేస్తుంది. అలాంటి సందర్బాలు చాలానే ఉన్నాయి. IPLలో పాల్గొనే ప్రతి జట్టుకు ఫీల్డింగ్ కోచ్ ను నియమించుకుంటున్నారు. గత మ్యాచ్ ల ఆధారంగా ఉత్తమ ఫీల్డర్లుగా ఉన్న వారు ఎవరో చూద్దాం..
ఈసారి దక్షిణాఫ్రికా ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ మంచి ఫీల్డింగ్ ఆశించొచ్చు. ఇతను డైనమిక్ బ్యాటర్ కూడా. దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ లో స్టబ్స్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. అతను ముంబై ఇండియన్స్‌కు కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా అద్భుతాలు చేయగలడు. ఈ ఐపీఎల్ కూడా అతను అల్ రౌండ్ ప్రదర్శన్ చేస్తారని అంచనా వేస్తున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లలో గ్లెన్ మాక్స్‌వెల్ ఆకట్టుకునే ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది. అతను బ్యాటింగ్, బౌలింగ్లో కూడా రాణించే అవకాశం ఉంది. సికందర్ రజా అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకడిగా ఉన్నాడు. ఈ ఐపీఎల్ లో కూడా ఇతని ఫీల్డింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. న్యూజిలాండ్ ఆటగాడు సంచలనాత్మక ఫీల్డర్ ఫిలిప్స్ గురించి చెప్పనవసరం లేదు. అతను ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్నాడు. ఇతను బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు.
గుజరాత్‌లో జట్టులో ఉన్న రషీద్ ఖాన్ కూడా అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేస్తాడు. ఇతను బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించే అవకాశం ఉంది. దీపక్ హుడా, అనుకుల్ రాయ్ కూడా బాగా ఫీల్డింగ్ చేస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications