276 స్ట్రైక్‌రేట్‌తో SRH బ్యాటర్ ఊచకోత.. లక్నోపై చెలరేగిన ఈ అనికేత్ ఎవరంటే?
Who is Aniket Verma: ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు... క్రీజులో ఉన్నది కాసేపైనా... సిక్సర్ల వర్షంతో ఓ ఊపు ఊపేశాడు. ఉప్పల్ స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. ఓ వైపు లక్నో బౌలర్లు తమ జట్టును ఊచకోత కోస్తుంటే.. అదే ఊచకోతను తిరిగి వారికి చూపించాడు. ఒక్క ఫోరు కూడా లేకుండానే సిక్సర్లతోనే విరుచుకుపడ్డాడు. దీంతో ఇప్పుడతడి గురించే క్రికెట్ అభిమానులంతా ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతడెరంటే అనికేత్ వర్మ.
ఆరంభం నుంచి అన్నీ సిక్సర్లే..
మ్యాచులో దూకుడుగా ఆడిన హెన్రిచ్ క్లాసెన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చాడు అనికేత్ వర్మ. వచ్చీ రాగానే ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శస్తూ వరుస సిక్సర్లతో చెలరేగాడు. 13 బంతుల్లో 276.92 స్ట్రైక్ రేట్ తో 36 పరుగులతో చేలరేగాడు. జట్టు 190/9 గౌరవప్రదమైన స్కోర్ చేసేలా చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన అతడు.. దిగ్వేశ్ బౌలింగ్‌లోనూ వరుసగా మరో రెండు సిక్స్‌లు బాది అదరగొట్టాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ చేతికి చిక్కాడు.

పుట్టింది అక్కడ - ఆడేది ఇక్కడ..
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో జన్మించాడు అనికేత్. వయసు 22 ఏళ్లు. కానీ మధ్యప్రదేశ్ తరఫున తన దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇతడిని హైదరాబాద్ ఫ్రాంఛైజీ వేలంలో కేవలం రూ. 30 లక్షలకే కొనుగోలు చేసింది. అయితే దేశవాళీ క్రికెట్ లో అంతగా ఏమీ పెద్ద ఘనతలు సాధించలేదు అనికేత్. అతడు 2024-25 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అనికేత్ తన సీనియర్ దేశీయ జట్టు తరపున ఒకే ఒక్క టీ20 మాత్రమే ఆడాడు.
ఆ జట్టుపై సెంచరీ...
అనంతరం మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు అనికేత్. ఐదు ఇన్నింగ్స్‌లలో 205 కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 244 పరుగులు సాధించాడు. అండర్ 23 పురుషుల వన్డే టోర్నమెంట్‌లో కర్ణాటకపై సెంచరీ బాది క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. అతడు మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications