Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలంలో రూ. 7.2 కోట్లు పలికాడు: ఎవరీ ఆండ్రూ టై

Who is Andrew Tye? Meet Australian pacer bought by KXIP for Rs 7.2 cr in IPL auction 2018

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ వేలం ముగిసింది. వేలంలో ఓ మంచి ఫాస్ట్ బౌలర్‌ను కొనుగోలు చేయడం ఫ్రాంఛైజీలకు ఎంతో ముఖ్యం. అదే విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే ఈ జాబ్ మరింత కఠినం. ఎందుకంటే వేలంలో ప్రాంఛైజీలు కేవలం 8 మంది విదేశీయులను కొనుగోలు చేయాలి.

ఆదివారం జరిగిన రెండో రోజు వేలంలో ఆండ్రూ టైని కొనుగోలు చేయడం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీసుకున్న సరైన నిర్ణయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గత 18 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వేలంలో రూ. 7.2 కోట్లకు కొనుగోలు చేసింది.

దీంతో ఆండ్రూ టై పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల ఆండ్రూ టై తన 26 ఏళ్ల వయసులో వెస్ట్రన్ క్రికెట్ ఆస్ట్రేలియా తరుపున వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ టోర్నీలో 19.30 యావరేజితో 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఇక, టీ20 క్రికెట్ విషయానికి వస్తే బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ షాకర్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో తన అద్భుతమైన యార్కర్లతో ప్రత్యర్ధి జట్లకు వణుకు పుట్టించాడు. 2016లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు.

29 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఆండ్రూ టైని గుజరాత్ లయన్స్ కొనుగోలు చేసింది. తాను ఆడిన ఆనేక మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తన యార్కర్లతో ప్రత్యర్ధి జట్లను ఒత్తిడికి గురి చేశాడు.

2017 ఏడాది ఆండ్రూ టైకి చాలా బాగా కలిసొచ్చింది. టీ20 క్రికెట్‌లో మూడు హ్యాట్రిక్ వికెట్లు తీసి అరుదైన గుర్తింపు సాధించాడు. ఇదే ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఆండ్రూని అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లలో ఒకడిగా నిలిపిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

కోట్లు కొల్లగొట్టిన విదేశీ క్రికెటర్లు:
* బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు, రాజస్థాన్ రాయల్స్)
* క్రిస్ లిన్ (రూ.9.6 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
* మిచెల్ స్టార్క్ (రూ.9.4 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
* గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.9 కోట్లు, ఢిల్లీ డేర్‌డెవిల్స్)
* రషీద్ ఖాన్ (రూ.9 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)
* క్రిస్ వోక్స్ (రూ.7.4 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
* ఆండ్రూ టై (రూ.7.2 కోట్లు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
* డ్వేన్ బ్రేవో (రూ.6.2 కోట్లు, చెన్నై సూపర్‌కింగ్స్)
* కీరన్ పొలార్డ్ (రూ.5.4 కోట్లు, ముంబై ఇండియన్స్)
* పాట్ కమిన్స్ (రూ.5.4 కోట్లు, ముంబై ఇండియన్స్)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 12:40 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+