Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంకెవరు నేనే?: నా విజయాల క్రెడిట్ నాకే దక్కుతుందన్న షమీ

ICC Cricket World Cup 2019 : Mohammed Shami Credits Himself For Changed Fortune || Oneindia Telugu
Who Else But Me: Mohammed Shami Credits Himself For Turnaround In Fortune

హైదరాబాద్: తన విజయాల క్రెడిట్ తనకే దక్కుతుందని టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం మాంచెస్టర్‌ వేదికగా విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో మహ్మద్ షమీ కీలకపాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా

నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా

ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు షమీ తెలిపాడు. షమీ మాట్లాడుతూ "కొంత కాలంగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. గత పద్దెనిమిది నెలలు ఎంతో భారంగా గడిచాయి. అప్పుడు నేనెంతగా బాధ పడ్డానో నాకు మాత్రమే తెలుసు" అని అన్నాడు.

నా విజయాల క్రెడిట్‌ నాకే దక్కుతుంది

నా విజయాల క్రెడిట్‌ నాకే దక్కుతుంది

"నా విజయాల క్రెడిట్‌ నాకే దక్కుతుంది కదా. ఇందుకు కారణంగా ఆ భగవంతుడే. ఫిట్‌నెస్‌, వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యల కారణంగా ఎంతో వేదన అనుభవించాను. యో-యో టెస్టులో విఫలమైనపుడు బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం డైట్‌ మెయింటేన్‌ చేస్తూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాను" అని షమీ తెలిపాడు.

తొందరగా అలసిపోవడం లేదు

తొందరగా అలసిపోవడం లేదు

"ఇప్పుడు తొందరగా అలసిపోవడం లేదు. ఏ ట్రాక్‌పై అయినా గానీ చెలరేగి ఆడగలనన్న నమ్మకం వచ్చింది" అని షమీ అన్నాడు. వరకట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ షమీ భార్య హసీన్‌ జహాన్‌ అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేసింది.

బీసీసీఐ నుంచి క్లీన్ చిట్

బీసీసీఐ నుంచి క్లీన్ చిట్

ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు గాను విచారణ ఎదుర్కొన్న షమీ.. బీసీసీఐ నుంచి క్లీన్‌చిట్‌ పొందాడు. ఆ తర్వాత ఆటపై దృష్టి సారించి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు తన కెరీర్‌ను గాడిలో పెట్టుకున్నాడు. భువీ గాయపడటంతో తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ప్రపంచకప్‌లో చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు.

Story first published: Friday, June 28, 2019, 14:47 [IST]
Other articles published on Jun 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+