రేపు విండిస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక!: తెరపైకి యువ క్రికెటర్లు

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనకు భారత జట్టును ఆదివారం చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేయనుంది. ప్రపంచకప్ తర్వాత వెళ్తున్న పర్యటన కావడంతో జట్టు ఎంపిక ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచకప్‌లో విఫలమైన సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్‌లకు జట్టులో చోటు దక్కడం కష్టమే. ఇప్పటికే మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్ వంటి యువ ఆటగాళ్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరితో పాటు గతకొంత కాలంగా దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్, నవదీపై సైనీ, రాహుల్ చాహర్, కేఎస్ భరత్ వంటి యువ క్రికెటర్ల పేర్లను సైతం సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆగస్టు 3న టీమిండియా విండీస్ పర్యటన ఆరంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. తొలుత టీ20 సిరిస్ ప్రారంభం కానుండటంతో ఇందులో రెండు టీ20లను అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించనున్నారు. కాగా, టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గాయం తర్వాత తన ఫిట్‌నెస్ ఇంకా నిరూపించుకోలేదు.

సెలక్టర్ల ఆలోచన ఇదీ
దీంతో విండిస్ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లను పూర్తిగా పక్కకు పెట్టే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు. దీంతో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌తో పాటు మూడో ఓపెనర్‌గా గుజరాత్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ప్రియాంక్ పంచల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్
ఇక, బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ అయితే ఓపెనర్ రేసులో ఉన్నాడు. లిస్టు ఏ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకలపై పరుగుల వరద పారించాడు. ఈ నేపథ్యంలో ఈశ్వరన్‌ను సైతం విండీస్ పర్యటనకు ఎంపిక చేస్తారనే అంటున్నారు. వికెట్ కీపర్‌గా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ధోని వారసుడిగా రిషబ్ పంత్ తన స్థానాన్ని జట్టులో పదిలం చేసుకున్నాడు.

సాహా వైపు సెలక్టర్లు మొగ్గు
ఇక, టెస్టుల్లో మాత్రం వృద్దిమాన్ సాహా వైపు సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహాల తర్వాత కేఎస్ భరత్‌వైపు సెలక్టర్ల దృష్టి ఉంది. ఇండియా-ఏ మ్యాచ్‌ల్లో కేఎస్ భరత్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు భరత్ ఆడిన చివరి 11 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 686 పరుగులు సాధించాడు.

ముందు వినిపిస్తోన్న పేరు నవదీప్ సైనీ
కీపింగ్‌లో 41 క్యాచ్‌లు, 6 స్టంపింగ్స్ చేశాడు. ఇక, బౌలింగ్ విభాగానికి వస్తే విండిస్ పర్యటనకు ఎంపికయ్యే బౌలర్లలో ముందు వినిపిస్తోన్న పేరు నవదీప్ సైనీ. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కంటే వేగంగా బౌలింగ్ చేయగల సత్తా సైనీ సొంతం. ఇటీవలే ఇంగ్లాండ్‌లో ముగిసిన ప్రపంచకప్‌కు సైతం నెట్స్‌లో కీలక బౌలర్‌గా కొనసాగాడు.

తెరపైకి రాహుల్ చహర్ పేరు
ప్రస్తుత క్రికెట్‌లో చైనామన్ స్పిన్నర్లు జోరు నడుస్తోంది. భారత చైనామన్ స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు తమ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అయితే ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో మాత్రం వీరిద్దరూ పూర్తిగావిఫలమయ్యారు. దీంతో వారికి ప్రత్యామ్నాయంగా రాహుల్ చహర్ తెరపైకి వచ్చాడు. విండిస్ పర్యటనకు రాహుల్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications