ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీసేనకు మరో గొప్ప అవకాశం

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే ఆతిథ్య ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేస్తే సరి. ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా, గురువారం(జులై 12) నుంచి నాటింగ్‌హామ్ వేదికగా తొలి వన్డే ఆడనుంది.
ఈ నేపథ్యంలో వన్డేల్లో తిరిగి నంబర్‌వన్ ర్యాంకుని చేజిక్కించుకునే అవకాశం టీమిండియాకు వచ్చింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 126 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 123 పాయింట్లతో టీమిండియా రెండో ర్యాంకులో కొనసాగుతోంది.

ఇంగ్లాండ్‌ను 3-0తో వైట్‌వాష్ చేస్తే సరి
గత మే నెలలో భారత్‌ను వెనక్కు నెట్టి ఇంగ్లాండ్ నంబర్ వన్ ర్యాంకుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా మళ్లీ ఆ ర్యాంకు పొందాలంటే ప్రస్తుత వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేయాలి. మరోవైపు ఇంగ్లాండ్ నంబర్ వన్ ర్యాంకుని నిలబెట్టుకోవాలంటే మరో 10 పాయింట్లు సాధించాలి.

అంత సులభం కాదు
ఇలా జరగాలంటే ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కోహ్లీసేనను వైట్‌వాష్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీసేనను ఓడించడం ఇంగ్లాండ్‌కు అంత సులభం కాదు. వరల్డ్‌కప్ సన్నాహకల్లో భాగంగా అన్ని జట్లు ఈ ఏడాది బీజీ షెడ్యూల్‌ను గడపనున్నాయి. ఈ సిరీస్‌ల్లోని ఫలితాలతో ర్యాంకులు తారుమారయ్యే అవకాశం ఉంది.

జూలై 17తో ముగియనున్న ఇంగ్లాండ్-భారత్ సిరీస్
జూలై 17న ఇంగ్లాండ్-భారత్ సిరీస్ ముగియనుండగా.. జూలై 13 నుంచి జింబాంబ్వే వేదికగా పాకిస్థాన్ 5 వన్డే మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 22 నుంచి వెస్టిండీస్-బంగ్లాదేశ్ జట్ల మధ్య 3 వన్డేల సిరిస్ జరగనుంది. ఈ వన్డే సిరిస్ బంగ్లాదేశ్‌లో జరగనుంది. జూలై 29 నుంచి దక్షిణాఫ్రికా శ్రీలంక వేదికగా 5 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.

126 రేటింగ్ పాయింట్స్‌తో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో
ఇక, ఆగస్టులో నేపాల్- నెదార్లండ్ జట్ల మధ్య రెండు వన్డే మ్యాచ్‌ల సిరిస్ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. మరోవైపు, జింబాంబ్వేపై పాక్ 4-1తో సిరీస్ గెలిస్తేనే తన ర్యాంకు నిలబెట్టుకోనుంది. అలాగే దక్షిణాఫ్రికా సైతం తన ర్యాంకు కోల్పోవద్దంటే శ్రీలంకను వైట్‌వాష్ చేయాలి.

బుధవారం(జులై 11)నాటికి ఐసీసీ వన్డే ర్యాంకులు:
1. ఇంగ్లండ్ 126 రేటింగ్ పాయింట్స్
2. భారత్ 123
3. దక్షిణాఫ్రికా 113
4. న్యూజిలాండ్ 112
5. పాకిస్తాన్ 102
6. ఆస్ట్రేలియా 100
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications