Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంఎస్ ధోనీ, యూసుఫ్ పఠాన్ లాంటి స్టార్ల రికార్డును బద్ధలు కొట్టిన అక్షర్ పటేల్.. ఛేజింగ్లో హవా..!

While Successful Chasing Axar Patel Broke the Record Of MS Dhoni and Yousuf Pathan

ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన 2వ వన్డేలో 64 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డేలలో ఎంఎస్ ధోనీ ఫీట్‌ను తన ఇన్నింగ్స్‌తో అధిగమించాడు. అక్షర్ పటేల్ తన కెరీర్లో తొలి వన్డే అర్ధ సెంచరీని బాదిన సంగతి తెలిసిందే. 312పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడంలో చివర్లో అక్షర్ పటేల్ ఆడిన ఇన్నింగ్సే కీలకం. అతను కేవలం 35 బంతుల్లో 64పరుగులు చేశాడు. 7వ స్థానంలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ 3ఫోర్లు, 5 సిక్సర్లతో థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో భారత్ వైపే విజయాన్ని దరిచేర్చాడు.

చివరి 5ఓవర్లలో భారత్‌కు 48పరుగులు కావాల్సిన సమయంలో ఒంటిగా పోరాడాడు. ఇక ఛేదనలో 5సిక్సర్లు బాదడం ద్వారా అతను ధోనీని అధిగమించాడు. ఎలాగంటే వన్డేల్లో 7లేదా అంతకుమించి స్థానంలో బ్యాటింగ్ దిగి విజయవంతంగా ఛేజింగ్ చేసిన సందర్భాల్లో 3కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన అరుదైన భారతీయ బ్యాటర్‌ల జాబితాలో ఎంఎస్ ధోనీని, అలాగే యూసుఫ్ పఠాన్‌లను అక్షర్ అధిగమించాడు.

2015లో జింబాబ్వేపై ధోనీ

2015లో జింబాబ్వేపై ధోనీ

2015లో జింబాబ్వేపై విజయవంతమైన రన్-ఛేజింగ్‌లో ఎంఎస్ ధోనీ 7వ స్థానంలో బరిలోకి దిగి 3 సిక్సర్లు కొట్టాడు. యూసుఫ్ పఠాన్ విజయవంతమైన రన్-ఛేజింగ్‌లలో రెండు సందర్భాలలో 3సిక్సర్లు కొట్టాడు. 2011లో దక్షిణాఫ్రికాపై, ఐర్లాండ్‌‌పై అతను ఈ ఫీట్ సాధించాడు. ఇక ఛేదనలో సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్లో హాఫ్ సెంచరీలు బాది మ్యాచ్ మూమెంటమ్ మార్చేశారు. అయితే వీరిద్దరూ ఔటయిపోవడంతో మ్యాచ్ కాస్త చేజారేలా కన్పించింది. దీపక్ హుడా సైతం 33పరుగుల వద్ద 45వ ఓవర్‌లో ఔటవ్వడంతో ఇక ఇండియాకు ఓటమి లాంఛనమే అనిపించింది. అయితే టెయిలండర్లతో కలిసి అక్షర్ పటేల్ వీరోచితంగా పోరాడాడు. తద్వారా భారత్‌ ఫినిషింగ్ లైన్ దాటి విజయం సొంంతం చేసుకుంది. ఇక ఈ విజయంతో 2-0తేడాతో సిరీస్ సైతం భారత్ వశమైంది.

 అయిదేళ్ల తర్వాత తొలిసారిగా వన్డే మ్యాచ్

అయిదేళ్ల తర్వాత తొలిసారిగా వన్డే మ్యాచ్

ఇక మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ స్పందించాడు. ప్రత్యేకించి వన్డే క్రికెట్‌లో మ్యాచ్ విన్నింగ్ కంట్రిబ్యూషన్ తన నుంచి రావాలని ఆశించానని అక్షర్ చెప్పాడు. 2017తర్వాత మరోసారి వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికైన ఈ గుజరాతీ ఆల్‌రౌండర్‌ అయిదేళ్ల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ ఆడుతున్నాడు. ఇక తొలి మ్యాచ్‌లోనూ భారత్ 3పరుగుల తేడాతో గెలుపొందగా.. చివర్లో అక్షర్ కీలకమైన 21పరుగులు చేశాడు.

ఆ భావనే చాలా గొప్పగా ఉంది

ఆ భావనే చాలా గొప్పగా ఉంది

'ఇది ఒక ప్రత్యేక సందర్భమని నేను భావిస్తున్నాను. ఇలాంటి కీలక సమయంలో నేను ఇంత బాగా ఆడడం సంతోషాన్నిస్తుంది. తద్వారా మా టీం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి సహాయపడిందనే భావనే చాలా గొప్పగా అనిపిస్తుంది. మేము ఐపీఎల్‌లో కూడా ఇలాంటి సిచువేషన్లు ఎదుర్కొన్నాము. ప్రశాంతంగా ఉండి మ్యాచ్ ఇంటెన్సిటీని కొనసాగించాలనుకున్నా. నేను ఆడగలను అని నమ్మాను. దాదాపు 5 ఏళ్ల తర్వాత వన్డే ఆడడం.. పైగా జట్టు కోసం ఇలాంటి అద్భుత ప్రదర్శన చేయగలగడం బాగుంది. ఇలాంటి ఆటనే కొనసాగించాలనుకుంటున్నాను' అని అక్షర్ పేర్కొన్నాడు.

Story first published: Monday, July 25, 2022, 17:46 [IST]
Other articles published on Jul 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+