టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ హవా.. నానాటికీ దిగజారిపోతున్న కోహ్లీ.. టాప్ 10లో ఇండియా ప్లేయర్లు..?


బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ కింగ్ కోహ్లీ మరోసారి దిగజారిపోయాడు. వరుసగా పేలవమైన ప్రదర్శనలు కనబర్చుతున్న కోహ్లీ.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇటీవల ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్ట్‌లో వీరోచితంగా పోరాడిన పంత్ నంబర్ 5వ స్థానానికి చేరుకున్నాడు.
ఇక ఈ టెస్ట్‌లో కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 20పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక పంత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 బంతుల్లో 146పరుగులు చేసి ఇండియాను కమాండింగ్ పొజిషన్‌కు తీసుకొచ్చాడు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో 57పరుగులతో కూడా రాణించాడు. కానీ ఈ మ్యాచ్‌లో భారత్.. ఇంగ్లాండ్ భీకర ఛేజింగ్‌కు తలవొగ్గక తప్పలేదు. ఇక పంత్ తన గత ఆరు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇటీవల టెస్టుల్లో అతని ఫామ్ వల్ల బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానం నుంచి ఆరు స్థానాలు ఎగబాకి అయిదో స్థానానికి చేరుకున్నాడు.

అగ్రస్థానంలో జోరూట్
ఇకపోతే టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయిదో టెస్టుల్లో ఇంగ్లాండ్ తమ అత్యధిక ఛేజింగ్ స్కోరు చేయడంలో రూట్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అతను (142నాటౌట్)తో సత్తా చాటాడు. అతను ప్రస్తుతం 923 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ 20బ్యాటర్ల జాబితాలో రూట్ చేరాడు.

భీకర్ ఫాంలో ఉన్న బెయిర్‌స్టో టాప్ 10లోకి..
ఇక బెయిర్‌స్టో సైతం అయిదో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో చెలరేగి ఇంగ్లాండ్‌కు అఖండ విజయం సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో అతను 11స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకుకు చేరుకున్నాడు. 32ఏళ్ల బెయిర్ స్టో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్లో చివరి రెండు మ్యాచ్‌లలో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అదే ఫ్లోను ఇండియాతో టెస్ట్‌లో కూడా అతను కనబరిచి.. ఇంగ్లాండ్‌ను అలవోకగా విజయ తీరాలకు చేర్చాడు.

47వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకుకు..
గత 3 టెస్టుల్లో 4సెంచరీలు చేసిన బెయిర్ స్టో ప్రస్తుతం కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. బెయిర్‌స్టో ప్రస్తుత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఆరు సెంచరీలతో 55.36 సగటుతో 1218పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు 541 పాయింట్లతో 47వ స్థానంలో ఉన్న బెయిర్‌స్టో.. నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీల తర్వాత.. అతను 2018 తర్వాత మొదటిసారి బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్ 10లోకి ప్రవేశించాడు.

ఆల్రౌండర్లు ఇంకా మనోళ్లే..
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున మూడు విభాగాల్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో రిషబ్ పంత్ 801రేటింగ్ పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా.. 746పాయింట్లతో రోహిత్ శర్మ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్.. ప్యాట్ కమ్మిన్ (నంబర్ 1ర్యాంకు) తర్వాత రెండో స్థానంలో, బుమ్రా 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇక ఆల్రౌండర్ల విషయంలో.. రవీంద్రా జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications