For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: వేలానికి ముందు ఎక్కువ మందిని వదిలించుకున్న జట్టు ఏదో తెలుసా?

Which team released most number of players ahead of Mini Auction

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) అగ్రస్థానంలో నిలుస్తుంది. అటు ఫ్రాంచైజీలకు, ఇటు ఆటగాళ్లకు అందరికీ కాసుల వర్షం కురిపించే ఈ లీగ్ గెలిచేందుకు ఆయా ఫ్రాంచైజీలు తపన పడుతుంటాయి. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన మెగా వేలంతో చాలా మంది ఆటగాళ్లను కొనేశాయి. అయితే ఈ ఏడాది మినీ వేలానికి ముందు వారిలో చాలా మందిని వదిలించుకున్నాయి.

ఫ్రాంచైజీల కఠిన నిర్ణయాలు

ఫ్రాంచైజీల కఠిన నిర్ణయాలు

వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ మినీ వేలానికి ముందు అన్ని జట్లు కూడా తాము రిటైన్ చేసుకుంటున్న ఆటగాళ్లు, రిలీజ్ చేస్తున్న ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో గతేడాది భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లను కూడా ఆయా ఫ్రాంచైజీలు నిర్దాక్షిణ్యంగా వదిలేశాయి. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు కొందరు కీలకమైన ఆటగాళ్లను రిలీజ్ చేసేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తోపాటు రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ తదితర జట్లు కూడా చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్నాయి.

భారీగా వదిలేసిన జట్లు

భారీగా వదిలేసిన జట్లు

ఇలా మినీ వేలానికి ముందు ఎక్కువ మంది ఆటగాళ్లను వదిలించుకున్న జట్టు ఏదో తెలుసా? గతేడాది మ్యాచ్, మ్యాచ్‌కూ టీంలో మార్పులు చేసి, ఆ కారణంగానే చతికిలపడిన కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ సారి కేకేఆర్ జట్టు ఏకంగా 16 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసేసింది. తాము భవిష్యత్తు కోసం జట్టును సిద్ధం చేస్తున్నామని గతేడాదే సంకేతాలు పంపిన ఆ జట్టు.. అదే బాటలో నడుస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

తర్వాతి స్థానాల్లో ఎవరున్నారంటే?

తర్వాతి స్థానాల్లో ఎవరున్నారంటే?

కేకేఆర్ తర్వాత అంత భారీ సంఖ్యలో ఆటగాళ్లను వదిలించుకున్న జట్టు ముంబై ఇండియన్స్. వెటరన్ కీరన్ పొలార్డ్‌ను కూడా రిలీజ్ చేసిన ఆ జట్టు మొత్తమ్మీద 13 మంది ఆటగాళ్లను వదులుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్. నికోలస్ పూరన్ సహా సన్‌రైజర్స్ జట్టు 12 మందిని వదిలేసింది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు చెరో 9 మంది ఆటగాళ్లను వదిలించుకున్నాయి. చెన్నై 8 మందిని, లక్నో ఏడుగురిని, గుజరాత్ ఆరుగురిని రిలీజ్ చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో ఐదుగురు ఆటగాళ్లను వదిలించుకున్నాయి.

Story first published: Wednesday, November 16, 2022, 12:31 [IST]
Other articles published on Nov 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+