
టెస్టుల్లో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది మనమే
ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఘనత మనదే. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాదంతా టెస్ట్ క్రికెట్‌లో మన టీం మెరుగ్గా రాణించింది. విదేశాల్లో సైతం మంచి విజయాలను నమోదు చేసింది. ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్లో ఓటమి మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల టీమిండియాదే పై చేయి. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 13 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్ ఏడింటిలో గెలిచింది. మూడు డ్రా చేసుకోగా.. మూడింటిలో ఓడింది. అయితే దాయాది జట్టు పాకిస్థాన్ కూడా ఈ ఏడాది ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన జాబితాలో భారత్‌తో సమంగా ఉంది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఏడింటిలో విజయాలు సాధించి.. రెండు ఓడిపోయింది. ఆ తర్వాత మూడో స్థానంలో నాలుగు విజయాలతో ఇంగ్లండ్ ఉంది.

టీ20ల్లో ఎక్కువ గెలిచింది ఎవరంటే?
టీ20 ఫార్మాట్‌లో ఈ ఏడాది ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జాబితాలో పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది 26 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 17 విజయాలు సాధించింది. ఆ తర్వాతి స్థానంలో 15 విజయాలతో సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉంది. 11 విజయాలతో మూడో స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. కాగా ఈ ఏడాది 16 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టీమిండియా 10 విజయాలతో ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.

వన్డేల్లో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది బంగ్లాదేశ్
ఇక ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జాబితాలో బంగ్లాదేశ్ ఉండడం విశేషం. ఈ ఏడాది 12 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఎనిమిదింటిలో విజయాలు సాధించింది. ఈ ఏడాది టాప్ టీమ్‌లు ఏవి కూడా వన్డేలు పెదగా ఆడకపోవడం బంగ్లాదేశ్‌కు కలిసొచ్చింది. ఈ జాబితాలో ఆరేసి విజయాలతో ఇంగ్లండ్, ఒమన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌పై తక్కువ ఫోకస్ పెట్టి టెస్ట్ క్రికెట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల టీమిండియా వన్డేల్లో తక్కువ మ్యాచ్‌లు ఆడింది. దీంతో ఈ ఏడాది 6 వన్డేలు మాత్రమే ఆడిన భారత జట్టు 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది.


Click it and Unblock the Notifications












