
ఈ ఏడాది చివరి టీ20 సిరీస్
న్యూజిల్యాండ్‌తో ఆడిన టీ20లే భారత్‌కు ఈ ఏడాది చివరి పొట్టి ఫార్మాట్ సిరీస్. ఇక మళ్లీ ఈ ఫార్మాట్‌లో వచ్చే ఏడాది మాత్రమే ఆడుతుంది. ఇక ఈ సిరీస్‌లో 1-0 తేడాతో గెలిచిన భారత జట్టు.. ఈ ఏడాదిలో కేవలం పొట్టి ఫార్మాట్‌లోనే ఏకంగా 289 సిక్సర్లు బాదింది. మరే జట్టూ ఇన్ని సిక్సర్లు బాదలేదు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న వెస్టిండీస్ ఈ ఏడాదిలో బాదిన సిక్సర్లు కేవలం 170 మాత్రమే.
అంటే వాళ్ల కన్నా 100పైగా ఎక్కువ సిక్సర్లు టీమిండియా బ్యాటర్లు బాదారన్నమాట. నెమ్మదైన ఆటతీరుతో విమర్శల పాలైన టీమిండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 32 సిక్సర్లు బాదాడు ఈ ఏడాదిలో.

అతనొక్కడే తేడా..!
టీమిండియా గురించి చెప్పుకుంటే ఈ ఫార్మాట్‌లో కచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది మొత్తం 32 మ్యాచుల్లో ఆడిన సూర్య.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌లో తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ సాధించిన ఈ చిచ్చరపిడుగు.. కివీస్‌పై మరోసారి శతకం స్కోరు సాధించాడు. దీంతో ఒకే ఏడాదిలో రెండు టీ20 శతకాలు బాదిన ఆటగాడిగా కూడా అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాదిలో సూర్యకుమార్ ఒక్కడే ఏకంగా 69 సిక్సర్లు బాదాడు. అందుకే టీమిండియా బాదిన సిక్సర్ల సంఖ్య మిగతా జట్లకు చాలా ఎక్కువగా ఉందనడం అతిశయోక్తి కాదు.

టాప్-5లో మిగతా జట్లు ఏవంటే?
ఇక ఈ ఏడాదిలో ఎక్కువ సిక్సర్లు బాదిన జట్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. భారత జట్టు 289 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో 170 సిక్సర్లతో వెస్టిండీ ఉండగా.. 167 సిక్సర్లతో టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ ఇంగ్లండ్ మూడో స్థానంలో నిలిచింది. 152 సిక్సర్లు బాదిన న్యూజిల్యాండ్ నాలుగో ర్యాంకులో ఉంది. ఐర్లాండ్ జట్టు ఈ ఏడాదిలో 144 సిక్సర్లు బాది ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా సౌతాఫ్రికా (118), పాకిస్తాన్ (114), శ్రీలంక (108), ఆస్ట్రేలియా (101) ఉన్నాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో చివరన ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications












