
గుజరాత్ టైటాన్స్
గతేడాది ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఈసారి కొంత బలహీనంగా కనబడుతోంది. ఆ జట్టు బౌలింగ్ విభాగం ఈ ట్రోఫీ విజయంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఈ మినీ వేలంలో కేన్ విలియమ్సన్, శ్రీకర్ భరత్‌లను గుజరాత్ కొనుగోలు చేసింది. వీళ్లు టాపార్డర్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి జట్టుకు మంచి ఆరంభాంలు అందించాల్సి ఉంటుంది. అలాగే మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ వేగంగా పరుగులు చేయాల్సి ఉంటుంది. గత సీజన్లో వీళ్లిద్దరూ రాణించారు. మరి ఈసారి ఎలా ఆడతారో చూడాలి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
వచ్చే సీజన్‌లో బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా కాదు. ఒకప్పుడు గేల్, కోహ్లీ, డివిల్లీర్స్ వంటి స్టార్ ఆటగాళ్లతో నిండిన ఈ జట్టు వచ్చే సీజన్‌లో ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్‌పై బాగా ఆధారపడుతుంది. ఇక మిడిలార్డర్ మొత్తం యువ ప్లేయర్ రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చుట్టూనే తిరుగుతుంది. ఇక ఫినిషర్‌గా మరోసారి డీకే ఆ జట్టుకు చాలా కీలకం కానున్నాడు.

రాజస్థాన్ రాయల్స్
గతేడాదిలాగే వచ్చే ఏడాది కూడా రాజస్థాన్ బ్యాటింగ్‌లో డెప్త్ ఎక్కువ లేదు. టాపార్డర్ అద్భుతంగా ఉన్నా మిడిలార్డర్‌లో దేవదత్ పడిక్కల్ పెద్దగా రాణించడం లేదు. జేసన్ హోల్డర్‌ను వేలంలో కొనుగోలు చేయడం రాయల్స్ వేసిన మంచి ప్లాన్. కానీ పొట్టి ఫార్మాట్‌లో అతని స్ట్రైక్ రేట్, యావరేజి అంత గొప్పగా లేవు. ఈ క్రమంలో జోస్ బట్లర్, సంజూ శాంసన్ మీదనే ఆ జట్టు బ్యాటింగ్ ఎక్కువగా ఆధార పడనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్
ఈ ఏడాది మినీ వేలానికి ముందే ట్రేడింగ్ విండోలో కోల్‌కతా ఎక్కువ షాపింగ్ చేసేసింది. రహ్మనుల్లా గుర్బాజ్, శార్దూల్ ఠాకూర్, లోకీ ఫెర్గూసన్ ముగ్గుర్నీ జట్టులో చేర్చుకుంది. అలాగే ఫామ్‌లో ఉన్న జగదీశన్, లిటాన్ దాస్‌ను కూడా కొనుగోలు చేసింది. ఈ జట్టు మిడిలార్డర్ శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్‌తో బలంగా కనిపిస్తోంది. అయితే కేకేఆర్ వద్ద సరైన బ్యాటింగ్ బ్యాకప్ ఎవరూ లేకపోవడం గమనార్హం.

పంజాబ్ కింగ్స్
శామ్ కర్రాన్ కోసం భారీగా ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన జట్టు పంజాబ్ కింగ్స్. అయితే ఆ జట్టు బ్యాటింగ్ భారమంతా విదేశీ ఆటగాళ్లపైనే ఉంది. మినీ వేలానికి ముందు రిలీజ్ చేసిన మయాంక్ అగర్వాల్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు పంజాబ్‌కు దొరకలేదు. అయితే శిఖర్ ధవన్ తప్ప మిగతా ఆటగాళ్లంతా భారీ హిట్టర్లే కావడం గమనార్హం. లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయర్‌స్టో, రాజపక్స, షారుఖ్ ఖాన్.. వీళ్లందరూ కూడా తొలి బంతి నుంచే భారీ షాట్లతో విరుచుకు పడే సత్తా ఉన్న వాళ్లే కావడం గమనార్హం.

లక్నో సూపర్ జెయింట్స్
నికోలస్ పూరన్ కోసం రూ.16 కోట్లు ఖర్చు పెట్టిన లక్నో.. స్ట్రాటజిక్‌గా ఈ ప్లాన్ పర్‌ఫెక్ట్ అని చెప్పాలి. జట్టులో ఎల్విన్ లూయిస్, మనీష్ పాండే ఇద్దరూ లేని లోటును పూడ్చడం పూరన్ బాధ్యత. అతని చేరికతో లక్నో టాప్ 5 స్థానాల్లో భారీ బ్యాటర్లు చేరారు. రాహుల్, డీకాక్, హుడా, పూరన్, స్టొయినిస్ ఉన్నారు. అయితే ఫినిషర్లుగా కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోనీ సేవలు ఆ జట్టుకు కీలకం. ఈ విషయంలోనే కొంత వెనుక బడే అవకాశం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఆ జట్టు టాపార్డర్ తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఉంది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రైలీ రూసో, రిషభ్ పంత్ అందరూ భారీ హిట్టర్లే. తాజాగా కొనుగోలు చేసిన ఫిల్ సాల్ట్ కూడా ఎటాకింగ్ ఆటగాడే. అయితే ఈ జట్టుకు కూడా బ్యాటింగ్ డెప్త్ సమస్యగా మారింది. చివర్లో పావెల్ విఫలమైతే లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్‌ల బ్యాటింగ్‌పై ఆ జట్టు ఆధార పడాల్సి వస్తుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్
వేలానికి ముందు బలహీనమైన బ్యాటింగ్‌తో ఉన్న సన్‌రైజర్స్ అద్భుతమైన స్ట్రాటజీతో వేలంలో సక్సెస్ సాధించింది. భారీ ధర పెట్టినా కూడా జట్టు బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసుకుంది. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిక్ క్లాసెన్ చేరికతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చాలా బలంగా తయారైంది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ ఉండనే ఉన్నారు. అలాగే బ్యాకప్‌గా కూడా వివ్రాంత్ శర్మ, సన్‌వీర్ సింగ్ కూడా ఉన్నారు. దేశవాళీల్లో వీళ్లిద్దరూ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.

చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్‌లో బలమైన బ్యాటింగ్ ఉన్న జట్లలో చెన్నై ఒకటి. సరిగ్గా జట్టును సెలెక్ట్ చేస్తే పదో నెంబర్ ఆటగాడి వరకూ ఆ జట్టులో బ్యాటింగ్ చేయగల సమర్ధులే. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, మొయీన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, ధోనీ తదితరులతో బ్యాటింగ్ విభాగం అంతా బలంగానే ఉంది. వీళ్ల బ్యాకప్‌గా అండర్ 19 వరల్డ్ కప్ విజేతలైన టీమిండియా యువ ఆటగాళ్లు హంగర్గేకర్, షేక్ రషీద్, నిశాంత్ సింధు తదితరులు ఉన్నారు.

ముంబై ఇండియన్స్
నాణ్యమైన భారతీయ బ్యాటర్లు, పవర్ హిట్టింగ్ ఫారెన్ ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ ఈసారి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. రోహిత్, ఇషాన్ ఓపెనర్లుగా ఉండగా.. టీ20 వరల్డ్ నెంబర్ వన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆ జట్టులో ఉండనే ఉన్నాడు. ట్రిస్టియన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌తో మిడిల్, లోయర్ ఆర్డర్ కూడా బలంగానే ఉంది. వీళ్లకు తోడు బ్యాకప్‌గా ఉన్న ఆటగాళ్లు కూడా సులభంగా 140పైగా స్ట్రైక్ రేటుతో పరుగులు చేయగల సమర్ధులే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications












