INDvsNZ : సెలెక్ట్ చేశారు సరే.. ఎక్కడ ఆడిస్తారు?.. యువ ఆటగాళ్లకు ఛాన్స్ దక్కదా?

న్యూజిల్యాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం యువకులతో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కూడా ఈ బృందంలో చోటు దక్కింది. అయితే అతనికి ఆడే 11 మందిలో చోటు దక్కుతుందా? అని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు.

ఎక్కడ ఆడిస్తారు?
సంజూ శాంసన్‌ను ఈ సిరీస్‌కు సెలెక్ట్ చేశారు సరే.. కానీ ఏ స్థానంలో ఆడిస్తారు? అని ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు. 'మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, నాలుగో ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నారు. ఈ లెక్కన సంజూను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలి. ఆ స్థానంలో సంజూ అంత యూజ్ అవుతాడని నేను అనుకోవడం లేదు. కావాలంటే దీపక్ హుడాను కూడా ఆ స్థానంలో ఆడించొచ్చు కదా' అని చోప్రా అన్నాడు.

అతనేడి?
ప్రపంచకప్‌లో భారత జట్టుకు సరైన ఆరంభాలు లభించలేదనేది కాదనలేని సత్యం. ఇదే విషయాన్ని లేవనెత్తిన చోప్రా.. 'నిజంగా పవర్‌ప్లేలో భారీ ఓపెనింగ్‌లు కావాలంటే పృథ్వీ షాను ఎంపిక చేయాలి కదా. శుభ్‌మన్ గిల్ మీకు అన్ని ఫార్మాట్ల ప్లేయరా? లేక టీ20 స్పెషలిస్టా? ఇక్కడ మనకు టీ20 స్పెషలిస్టు కావాలి. భారీ ఓపెనింగ్‌కు అవసరం అనుకున్నప్పుడు సహజంగానే విధ్వంసకరంగా ఆడే పృథ్వీ షా వంటి వాళ్లను తీసుకోవాలి కదా' అని ఆకాష్ చోప్రా అన్నాడు. చాలా మంది అభిమానులు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

ఉమ్రాన్‌కు చోటు దక్కేనా?
బౌలర్ల విషయంలో కూడా చోప్రా పెద్ద సంతోషంగా లేడు. జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్ ఇద్దరికీ ఆడే అవకాశం రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. 'ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్‌లను కూడా ఎంపిక చేశారు. కానీ వాళ్లకు ఆడే ఛాన్స్ దొరుకుతుందా? హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ ఆటోమేటిక్‌గా జట్టులోకి వచ్చేస్తారు. ఎందుకంటే చివర్లో హర్షల్ అయితే బ్యాటింగ్ కూడా చేయగలడు. కాబట్టి ఉమ్రాన్, సిరాజ్ ఇచ్చే ఎక్స్‌ట్రా పేస్‌ను కూడా యూజ్ చేసుకోలేరు' అని చోప్రా స్పష్టం చేశాడు. కివీస్ టూర్‌కు జట్టును ప్రకటించిన తర్వాత సెలెక్టర్లపై కూడా చాలా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications