Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమ్ ఇండియా వైభవం అంతా మసకబారుతుందా..?

Team India
బర్మింగ్‌హామ్: రెండు సంవత్సరాల పాటు మొట్టమొదటి స్దానంలో నెంబర్ వన్‌గా కొనసాగిన టీమ్ ఇండియా ఇటీవల లార్డ్స్, ట్రెంట్ బ్రిడ్జిలో రెండు టెస్టుల వైఫల్యం ఇండియా చరిత్రను మసకబారిస్తున్నాయి. సోమవారం ఉదయం మిగిలిన రెండు టెస్టులకు ఎడ్జిబాస్టన్ గ్రౌండ్లో ప్రాక్టీసు చేస్తున్న టీమ్ ఇండియా తిరిగి మరలా పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటామని అంటున్నారు. బుధవారం నుండి జరగనున్న మూడవ టెస్టులో ఇండియా తప్పని సరిగా గెలిస్తేనే తన వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్‌ని నిలబెట్టుకుంటుంది. ఒకవేళ టీమ్ ఇండియా గనుక ఓడిపోతే ఇంగ్లాండ్ నెంబర్ 1 కావడం ఖాయం. ఇక మూడవ స్దానానికి సౌత్ ఆఫ్రికా వస్తుంది.

మూడేళ్లు.. 10 సిరీస్‌లు.. 8 విజయాలు.. మూడు డ్రాలు.. ఒక్క సిరీస్‌ ఓటమీ లేదు.. ఇదీ మహేంద్రసింగ్‌ కెప్టెన్సీ రికార్డు. మరే భారత కెప్టెన్‌కు సాధ్యం కాని రీతిలో అనితర సాధ్యమైన విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న ఇంగ్లాండ్‌ చేతిలో తాజా ఓటములు మింగుడుపడనివే. ప్రతిభకు అదృష్టం కూడా తోడవడంతో గత మూడేళ్లలో ఎదురైన సవాళ్లన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్న ధోనీకి.. ఇంగ్లాండ్‌ మాత్రం కఠిన పరీక్షే పెడుతోంది. ఓవైపు 'అజేయ కెప్టెన్‌' హోదాకు ప్రమాదం.. మరోవైపు నెంబర్‌వన్‌ పీఠం కిందికి నీళ్లు.. ఇంకోవైపు బ్యాట్స్‌మన్‌గా పేలవ ఫామ్‌.. ఇలా ధోనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు.

''నా దగ్గరున్న వ్యూహాలన్నీ వాడేశా. ఒక్కటీ పనిచేయలేదు. ఇక నా దగ్గర ప్రణాళికలేమీ మిగల్లేదు'' రెండో టెస్టులో ఓటమి అనంతరం ధోనీ అన్న మాటలివి. క్లిష్ట సమయాల్లో అద్భుతమైన వ్యూహాలు రచిస్తాడని.. బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ కూర్పులతో ప్రత్యర్థుల్ని బుట్టలో వేస్తాడని పేరున్న ధోనీ.. ఇంత బేలగా మాట్లాడతాడని ఊహించలేం. మైదానంలో అతని దేహభాష్యం కూడా ముందులా ఆత్మవిశ్వాసంతో లేదు. రెండో టెస్టులో భారత్‌ ఓటమికి ధోనీ కెప్టెన్సీ వైఫల్యం కూడా కారణమనే వారున్నారు. ఫీల్డింగ్‌ కూర్పు విషయంలో అతనికి పదికి మూడు మార్కులే వేశాడు గవాస్కర్‌. హోల్డింగ్‌ సైతం ధోనీ కెప్టెన్సీపై పెదవి విరిచాడు. ప్రతికూల సమయయాల్లో గతంలో లాగా నిబ్బరం చూపలేకపోతున్నాడన్నది ఓ విమర్శ. బహుశా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతుండటం అతనిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి కారణం కావచ్చు.

ఇది ఇలా ఉంటే వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్ లాంటి అత్యుత్తమమైన బ్యాట్స్ మెన్ టీమ్ ఇండియాలో ఉండి కూడా ఇలా జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక బౌలర్స్ మునాఫ్ పటేల్, అమిత్ మిశ్రా మంచి అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరితో పాటు టీమ్ ఇండియాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, అభినవ్ ముకుందా, ఇషాంత్ శర్మ లాంటి ఆటగాళ్లు ఉండి కూడా ఇలా జరగడం ఏంటని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+