న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

త్వరలో విండిస్ పర్యటన: NO.4 మళ్లీ మొదటికి! ఈసారి యువ క్రికెటర్లకు పరీక్ష!

Team India West Indies Tour 2019 : Panth,Shreyas Or Shubman Gill,Who Suits For No.4 Position ?
Where are Indias genuine middle-order batsmen?

హైదరాబాద్: ప్రపంచకప్ ముగియడంతో టీమిండియా త్వరలో ఆరంభమయ్యే వెస్టిండిస్ పర్యటనపై దృష్టి సారించింది. దీంతో విండిస్ పర్యటనకు ఆటగాళ్ల ఎంపిక అటు సెలక్టర్లతో పాటు ఇటు బీసీసీఐకి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే NO.4 స్థానం మళ్లీ మొదటికొచ్చింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌కు ముందు NO.4 స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే దానిపై పెద్ద చర్చే జరిగింది. ఒకానక సందర్భంలో NO.4 స్థానానికి అంబటి రాయుడు సరిపోయాడని చెప్పిన కోహ్లీ ఆస్ట్రేలియా సిరిస్ అనంతరం మాట మార్చాడు. అంతలో ప్రపంచకప్ రావడం NO.4 స్థానానికి రాయుడికి బదులు విజయ్ శంకర్ చోటు దక్కించుకున్నాడు.

NO.4 స్థానం కోసం

NO.4 స్థానం కోసం

ప్రపంచకప్ మొదలైంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఉండటంతో NO.4 స్థానం కోసం కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ల మధ్య గట్టి పోటీ నడించింది. చివరికు కేఎల్ రాహులే ముందుగా ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో రాహుల్‌ని ఓపెనర్‌గా కుదురుకున్నాడు.

నిరాశపరిచిన విజయ్ శంకర్

నిరాశపరిచిన విజయ్ శంకర్

దీంతో NO.4 స్థానం విజయ్ శంకర్‌కు దక్కింది. అయితే విజయ్ శంకర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా వేసిన బంతికి విజయ్ శంకర్ గాయపడటం.. ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్‌ని క్రీజులోకి దింపారు. అయితే, పంత్ కూడా తనను తాను నిరూపించుకోలేకపోయాడు.

ఆగస్టు 3 నుంచి విండిస్ పర్యటన ప్రారంభం

ఆగస్టు 3 నుంచి విండిస్ పర్యటన ప్రారంభం

విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 3న జరిగే తొలి టీ20తో వెస్టిండిస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి నెం.4 స్థానంపై చర్చ తెరమీదకు వచ్చింది. ఈసారి సెలక్టర్లు ఈ స్థానంలో యువ క్రికెటర్లను పరీక్షించాలనుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ స్ధానంలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శుభ్‌మాన్ గిల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి, వీరిలో ఎవరు రాణిస్తారో చూడాలి.

Story first published: Wednesday, July 17, 2019, 19:42 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X