
యువీ ఔటవ్వగానే ఓడిపోతామనుకున్నా
లాక్‌డౌన్ సందర్భంగా నాటి చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకున్న కైఫ్, యువీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా కైఫ్ మాట్లాడుతూ ఆ ఫైనల్ మ్యాచ్‌లో యువీ ఔటవ్వగానే భారత్ ఓడిపోతుందని అనుకున్నట్లు చెప్పాడు. 'యువీ ఆరోజు నువ్వు ఔటవ్వగానే మ్యాచ్ ఓడిపోతామనుకున్నా. మనం గెలుస్తామనుకోలేదు. అప్పటికే నేను కుదురుకున్నాను. నువ్వు క్రీజులో ఉన్నావు. దాంతో చివరివరకూ మనం క్రీజులో ఉంటే కచ్చితంగా గెలుస్తామని భావించా. కానీ.. నువ్వు ఔటయ్యేసరికి చాలా నిరాశ చెందా' అని కైఫ్ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.

87 పరుగులు చేసి నాటౌట్
326 పరుగుల లక్యంతో దిగిన భారత్ టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. యువరాజ్, కైఫ్ ఆదుకోవడంలో భారత్ గెలుపుపై నమ్మకంగా ఉంది. ఈ క్రమంలో యువీ పెవిలియన్ చేరాడు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బాధ్యతాయుతంగా కైఫ్ బ్యాటింగ్ చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్‌ను టీమిండియాకు అందించాడు. చివరివరకూ క్రీజులో ఉండి జహీర్ ఖాన్ కూడా అద్భుతంగా ఆడాడు.

ఆసీస్ కుర్రాళ్ల బౌలింగ్‌ను ఉతికారేశాడు
మహ్మద్ కైఫ్ ఇంకా మాట్లాడుతూ... 2000 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువరాజ్ సింగ్ (58; 25 బంతుల్లో) ఆస్ట్రేలియాపై బాదిన అర్ధ శతకం కూడా తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో మిచెల్ జాన్సన్, షేన్‌వాట్సన్ లాంటి ఆసీస్ కుర్రాళ్ల బౌలింగ్‌ను ఉతికారేశాడని కైఫ్ వెల్లడించాడు. అనంతరం యువరాజ్ మాట్లాడుతూ... తామిద్దరం భారత ఫీల్డింగ్‌ను మార్చేశామని చెప్పాడు. ఇప్పుడు భారత జట్టులో చాలా మంది మంచి ఫీల్డర్లు ఉన్నారని పేర్కొన్నాడు.

భారత ఫీల్డింగ్‌ను మార్చేశాం
ఫీల్డింగ్‌లో చిరుతలా కదులుతూ భారత్‌కు మహ్మద్ కైఫ్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని యూవీ ఇన్‌స్టాగ్రామ్‌లైవ్ చాట్‌లో పొగడ్తలతో ముంచెత్తాడు. పాయింట్, కవర్‌లలో తామిద్దరం కలిసి భారత ఫీల్డింగ్ విభాగంలో ఒక కొత్త సరళిని తీసుకొచ్చామన్నాడు. ఇప్పుడున్న భారత జట్టులో మంచి ఫీల్డర్లున్నారని, కానీ భారత జట్టు ఫీల్డింగ్‌లో ఓ కొత్త ఒరవడి మాత్రం తామే తీసుకొచ్చామని నవ్వుతూ యూవీ చెప్పాడు.


Click it and Unblock the Notifications












