న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఓ ఎండ్‌లో నువ్వు బౌలింగ్ చేయకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది'

Kuldeep Tells Chahal 'When you're Not Bowling At Other End,There's Something Missing' | Oneindia
When youre not bowling at other end, theres something missing: Kuldeep tells Chahal

హైదరాబాద్: ఓ ఎండ్‌లో యజువేంద్ర చాహల్ బౌలింగ్ చేయకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుందని మరో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో చాహల్ గురించి కుల్దీప్ యాదవ్ మాట్లాడాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్: టిట్సిపాస్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి రఫెల్ నాదల్ఆస్ట్రేలియన్ ఓపెన్: టిట్సిపాస్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి రఫెల్ నాదల్

"నీవు ఆడకపోతే చాలా అంశాలు మరుగున పడిపోతాయి. మా ఇద్దరి బౌలింగ్‌ను, పిచ్‌ను పరస్పరం బాగా అర్థం చేసుకున్నాం. మా ఇద్దరి మధ్య అంతా బాగా సమన్వయం కుదిరింది. ఒక్కోసారి నేను ముందుగా బౌలింగ్‌కు వస్తే కొన్నిసార్లు అతను వస్తాడు. పరిస్థితులను బట్టి ఇది ఉంటుంది" అని అన్నాడు.

పిచ్ ఎలా ఉంది

"ఏదేమైనా పిచ్ ఎలా ఉంది, బ్యాట్స్‌మన్ ఎలా ఆడుతున్నాడు అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని మా వ్యూహాలు రచిస్తాం. చాహల్, నేను ఒకే రకమైన ఫలితాన్ని రాబడుతాం. అందుకే బ్యాట్స్‌మెన్ బాగా ఇబ్బందిపడుతారు. దక్షిణాఫ్రికాలో మేం చాలా వికెట్లు తీశాం. భారత్‌లో మాకు ఎదురులేదు. ఇప్పుడు కివీస్‌లోనూ సత్తా చాటాలని చూస్తున్నాం" అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

చైనామన్ స్పిన్నర్లు ఇద్దరూ కీలకంగా

చైనామన్ స్పిన్నర్లు ఇద్దరూ కీలకంగా

టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఈ చైనామన్ స్పిన్నర్లు ఇద్దరూ కీలకంగా మారారు. ఇద్దరూ కలిసి భారత్ తరుపున ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించారు. అయితే ఈ మధ్యకాలంలో ఇద్దరిలో ఒక్కర్నే ఆడించి జడేజాతో చేసిన ప్రయోగాలన్నీ ఫలితాలనివ్వలేదు.

మే 30న ప్రారంభం కానున్న వరల్డ్‌కప్

మే 30న ప్రారంభం కానున్న వరల్డ్‌కప్

దీంతో ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఈ ఇద్దరు కీలకం కానున్నారు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకునే అటగాళ్ల రేసులో సైతం వీరిద్దరూ ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది మే 30న ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, January 25, 2019, 10:40 [IST]
Other articles published on Jan 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X