సెమీస్‌లో అడుగుపెడుతున్నందుకు అభినందనలు


హైదరాబాద్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆరంభమైన టోర్నీలో ఆరంభం నుంచి హర్మన్‌ప్రీత్ సేన అదరగొడుతోంది. తొలి 3 మ్యాచ్‌లలో హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన భారత మహిళా క్రికెటర్లు.. నాకౌట్ పోరులోనూ పటిష్టంగా కనిపించిన ఆస్ట్రేలియాతోనూ అదే జోరు కొనసాగించింది. బ్యాటింగ్‌లో మంధాన(83; 55 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సులు) ధనాధన్ మెరుపులు.. బౌలింగ్‌లో అనూజ (3/15), పూనమ్ యాదవ్ (2/28), రాధ యాదవ్ (2/10), దీప్తి శర్మ (2/24) ఆసీస్ బ్యాట్స్‌వుమెన్‌ను ఓ ఆట ఆడుకోవడంతో మొత్తంగా 48పరుగుల భారీ తేడాతో భారత్ ఖాతాలో మరో అద్భుత విజయం వచ్చిచేరింది.
తొలి మూడు మ్యాచ్‌లలో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరిన ఎడమ చేతి వాటం బ్యాటర్.. ఓపెనర్ మంధాన ఆసీస్‌తో మ్యాచ్‌లో సరైన సమయంలో గేర్ మార్చి సిసలైన ఆటతో దూకుడు కొనసాగించింది. తాజా విజయంతో గ్రూపు-బిలో భారత్ ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 8పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో టీమిండియాను ప్రోత్సాహిస్తూ.. క్రికెట్ దిగ్గజాలంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదే కొనసాగించాలని కోరుకుంటున్నా.
మహిళల ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియాకు ప్రత్యేక అభినందనలు. ఆస్ట్రేలియాపై మీ ప్రదర్శన నిజంగా అద్భుతం. సెమీస్‌లో ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నా.
నాలుగో విజయంతో సగర్వంగా సెమీస్‌లోకి
వరుసగా నాలుగో విజయంతో సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టిన టీమిండియాకు అభినందనలు.
మిగిలింది రెండడుగులు మాత్రమే.
మీ ప్రదర్శన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆసీస్ బౌలర్లపై స్మృతి ఎదురుదాడికి దిగిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. దీనికితోడు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగో విజయం. ఇక మిగిలింది రెండడుగులు మాత్రమే. దూసుకెళ్లండి. ఆల్ ది బెస్ట్ టీమిండియా.
స్మృతి నువ్వు అద్భుతం.
నాకౌట్‌కు ముందు ఆసీస్ వంటి జట్టుపై విజయం భారత్‌కు ఎంతో కీలకం. అమ్మాయిలూ అదరగొట్టేశారు. గ్రూపు దశలో అగ్రస్థానంతో సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టారు. జట్టుగా ప్రతి ఒక్కరూ అద్భుత ప్రదర్శన చేశారు. స్మృతి నువ్వు అద్భుతం.
మంధాన ఈ రోజు నీకెంతో ప్రత్యేకం
తెలివైన ఆటతో మరో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియాకు అభినందనలు. స్మృతి మంధాన ఈ రోజు నీకెంతో ప్రత్యేకం. సెమీస్‌లోనూ ఇదే జోరు కొనసాగించండి.
ఆరంభం నుంచి ఆస్ట్రేలియాపై ఆధిప్యతం చెలాయిస్తూ మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత మహిళల జట్టుకు అభినందనలు. ఈ మ్యాచ్‌లో మీ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.
మూడు సార్లు ఛాంపియన్‌ను టీమిండియా ఎదుర్కొన్న తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిపై టీమిండియా అద్భుతంగా ఆధిపత్యం చెలాయిస్తుంది. స్మృతి ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇదే దూకుడు కొనసాగించండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications