విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తోన్నప్పుడు దీపావళి ఆన్‌లైన్ షాపింగ్ బంద్ అయిందంటే నమ్మగలరా..!!
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. టీమిండియా మాజీ కేప్టెన్, బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ- ఈ మ్యాచ్‌లో విశ్వరూపాన్ని చూపాడు. ఓటమి కోరల్లో ఉన్న జట్టును గెలుపుబాట పట్టించాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు ఒంటిచేత్తో గెలుపుబాట పట్టించాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

కోహ్లీ విజృంభణ ముందు..
పాకిస్తాన్‌పై భారత్ గెలవాలంటే చివరి 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశ అది. విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్రీజ్‌లో ఉండటం వల్ల విజయం భారత్‌నే వరిస్తుందనే ఆశ అభిమానుల్లో నెలకొంది. 19వ ఓవర్‌లో గేర్ మారిస్తే గానీ విజయం దక్కదనే విషయం వారిద్దరికీ తెలుసు. స్టార్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సంధించిన ఓవర్ అది. పైగా ఆ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో వచ్చింది మూడు పరుగులే. ఆ తరువాత కోహ్లీ విజృంభించాడు. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీనితో ఈక్వేషన్స్ మారిపోయాయి.

మెరుపు వేగంతో
ఆ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మెరుపువేగంతో ఆ రెండు బంతులను ఫెన్సింగ్ దాటించాడు. 19వ ఓవర్‌లో 17 పరుగులు రావడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం అయ్యాయి టీమిండియాకు. దాన్ని లాంఛనంగా ముగించాడు కోహ్లీ.
అరుదైన ఘటన..
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తోన్నప్పుడు ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ కంప్లీట్‌గా బంద్ అయింది. దాని వైపు కూడా కన్నెత్తి చూడలేదు కొనుగోలుదారులు. తమ దృష్టి మొత్తాన్నీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పైనే కేంద్రీకృతం చేశారు. అందులో నుంచి బయటికి రావడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. తెల్లవారితే దీపావళి అనే విషయం తెలిసి కూడా ఆన్‌లైన్ షాపింగ్ చేయడాన్ని మానేసి మరీ టీవీలకు అతుక్కుపోయారు.

భారత్ పే, యూపీఐ డేటా ఇదే..
దీనికి సంబంధించిన ఓ డేటాను భారత్ పే, యూపీఐ వెల్లడించాయి. ఆదివారం మధ్యాహ్నం 1:30 వరకు ఆన్‌లైన్ షాపింగ్ పతాక స్థాయిలో జరిగింది. కొనుగోలుదారులు పెద్ద ఎత్తున షాపింగ్ చేశారు. సరిగ్గా మ్యాచ్ ఆరంభం అయ్యే సమయం అంటే మధ్యాహ్నం 1:30కు ఆన్‌లైన్ షాపింగ్ గ్రాఫ్ పడిపోయింది. పాకిస్తాన్‌పై టీమిండియా బౌలింగ్ చేస్తోన్న సమయంలో మైనస్‌లోకి వెళ్లింది షాపింగ్ గ్రాఫ్. ఏడుశాతం మైనస్‌ను చూపించింది.

కోహ్లీ బ్యాటింగ్ చేస్తోండగా..
ఇక టీమిండియా బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఆ గ్రాఫ్ మరింత మైనస్‌లోకి వెళ్లిపోయింది. తొలుత 10, అనంతరం 15.. చివరికి 20 శాతం మేర ఆన్‌లైన్ షాపింగ్ గ్రాఫ్ మైనస్‌గా చూపించింది. చివరి ఓవర్లల్లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తోన్నప్పుడు ఈ గ్రాఫ్ మరింత కిందికి దిగజారడం ఈ డేటాలో స్పష్టంగా కనిపించింది. మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి ఆన్‌లైన్ షాపింగ్ గ్రాఫ్ పైపైకి ఎగిసింది. సాధారణ స్థితికి చేరుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఈ డేటాలో చూడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications