న్యూఢిల్లీ: గత కొంత కాలంగా దూరంగా ఉంటూ ఇటీవలే మళ్లీ దగ్గరైన ప్రేమజంట ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. వారే భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. కొద్ది రోజుల నుంచి పార్టీలకు కలిసి తిరుగుతున్నారు.
కాగా, విరాట్ కోహ్లీ.. తన ప్రియురాలు అనుష్క శర్మను ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల అనుష్క శర్మకు సెండాఫ్ ఇవ్వడానికి విమానాశ్రయానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

బ్రేకప్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత కోహ్లీ, అనుష్కలు పలుమార్లు జంట కనిపించారు. అయితే, అనుకోకుండానే కొద్ది రోజుల క్రితం అనుష్క శర్మను కలిసిన విరాట్ కోహ్లీ ఆమెకు షాకిచ్చాడు. అంతేగాక, ఆమెతో తన విలువైన సమయాన్ని గడిపాడు.
ఈ సమయంలో కోహ్లీ, అనుష్క.. ఓ అభిమాని(యువతి)తో ఫొటో దిగారు. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన సదరు అభిమాని.. వెంటనే దాన్ని తొలగించారు. దీంతో ఫొటో అందరూ చూడకుండానే మాయమైపోయింది.