న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం లోపల, బయటా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు. ఆదివారం ముంబైలోని మలద్ ఓ షాపింగ్ మాల్‌లో తాను అంబాసిడర్‌గా ఉన్న 'వ్రోగన్' ప్రచార నిమిత్తం అభిమానులతో ముచ్చటించాడు.

ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన చిత్రమైన సంఘటలను వారితో పంచుకున్నాడు. ఒకసారి మలేసియాలో తాను బొద్దింకల ప్రై తినబోయానని చెప్పాడు. పచ్చడి అనుకోని బొద్దింకలను దాదాపు నోట్లో వేసుకోబోయానన్నాడు.
ఇంతలో ఒకరు వచ్చి అది పచ్చడి కాదు. బొద్దింక అని చెప్పడంతో అవాక్కయ్యానని తెలిపాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో మాత్రం కోహ్లీ వెల్లడించలేదు. కాకపోతే, మలేసియాలో జరిగిన 2008 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా వ్వవహరించాడు.

ఈ టోర్నమెంట్ సందర్భంలోనే విరాట్ కోహ్లీకి ఈ ఘటన ఎదురై ఉండొచ్చని అభిమానులు అంచనా వేశారు. అయితే మరో సందర్భంలో తాను 28 గంటల పాటు నిద్రపోలేదని విరాట్ కోహ్లీ చెప్పాడు.