వరల్డ్‌కప్: ఈడెన్‌లో బాటిల్స్ విసిరి, స్టాండ్స్‌కు నిప్పుపెట్టిన వేళ (వీడియో)

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.
జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. భారతదేశం ఆతిథ్యమిచ్చిన 1996 వరల్డ్‌కప్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. అయితే, ఈ ఓటమిని తట్టుకోలేక ప్రేక్షకులు గ్రౌండ్‌లోకి నీళ్ల సీసాలు విసరడంతో పాటు స్టాండ్స్‌కు నిప్పుపెట్టారు.
ఈ సంఘటనను ఓసారి గుర్తు చేసుకుందాం...

1996 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో
1996 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌కి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. సొంతగడ్డపై మరోసారి కప్‌ను చేజిక్కించుకోవాలన్న కసిమీద ఉన్న టీమిండియా అందుకు తగ్గట్లే సెమీఫైనల్‌కు చేరింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ అజహరుద్దీన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంక
దీంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అరవింద డిసిల్వా, మహానామా హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో చివరకు శ్రీలంక 251 పరుగులు చేసింది. తక్కువ స్కోరే కావడంతో టీమిండియానే విజయం సాధిస్తుందని అంతా భావించారు. ఆరంభంలో సిద్ధు వెనుదిరిగినా మంజ్రేకర్‌తో కలిసి సచిన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

వరుసగా వికెట్లను కోల్పోయిన సచిన్
అయితే, సచిన్ ఔటయ్యాక టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. సచిన్ ఔటైన తర్వాత అజహరుద్దీన్, అజయ్ జడేజా, నయన్ మోంగియా వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత్ 120 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టాండ్స్‌లోని సీట్లకు నిప్పుపెట్టిన అభిమానులు
భారత్ ఓటమి ఖాయం కావడంతో జీర్ణించుకోలేకపోయిన అభిమానులు మ్యాచ్‌ను అడ్డుకున్నారు. ముందు వాటర్ బాటిల్స్‌ను గ్రౌండ్‌లోకి విసిరి నిరసన తెలిపిన ప్రేక్షకులు ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయి.. స్టాండ్స్‌లోని సీట్లకు సైతం నిప్పుపెట్టారు. దీంతో ఆ స్కోరు వద్ద నిర్వాహకులు శ్రీలంకను విజేతగా ప్రకటించారు. పైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications