టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వభావం గురించి ఓ సందర్భంలో కొన్ని కీలక కామెంట్స్ చేశాడు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. తానెందుకు మైదానంలో విరాట్ లా వ్యవహరించడో వివరించాడు. విరాట్ లా ఉండాలనుకునేవారి విషయంలో తనకు కలిగే ఆందోళన గురించి చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే
భారత క్రికెట్‌కు 'ది గ్రేట్ వాల్'గా పేరుగాంచాడు మిస్టర్ డిపెండబుల్ రాహుల్. కెరీర్లో బ్యాటర్ గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా విభిన్న పాత్రలు పోషించి ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మైదానంలో అతడి స్వభావం విషయానికొస్తే ఓ మంచి ఆటగాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. జెంటిల్మెన్ ఆఫ్ క్రికెట్. మైదానంలో ఎప్పుడూ ఆవేశపడిన సందర్భాలు లేవు. ఎందరో జూనియర్ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. ఇక ఇదే క్రికెట్ లో స్టార్ బ్యాటర్ కోహ్లీ విషయానికొస్తే దూకుడుకు మారు పేరు. కేవలం రికార్డుల పరుగులు మాత్రమే కాదు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవపడిన సందర్భాలు కూడా ఎక్కువ.

అయితే కొంతమంది మాజీ క్రికెటర్లు, యంగ్ క్రిికెటర్లు కూడా విరాట్ దూకుడుతనం, యాటిట్యూడ్ కు ఫిదా అయ్యేవారు. అతడిని స్ఫూర్తిగా తీసుకుని మైదానంలో లేదా బయట తనలా ఉండటానికి ప్రయత్నించేవారు. కానీ ద్రవిడ్ మాత్రం అలా కాదు! విరాట్ స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, మైదానంలో అతడిలా ఎప్పుడూ ఉండలేదు. కెరీర్ మొత్తంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకుని గుర్తింపు తెచ్చకున్నాడు.
గతంలో ఓ సందర్భంలో కోహ్లీ గురించి మాట్లాడిన ద్రవిడ్, తానెందుకు విరాట్ లా మైదానంలో వ్యవహరించలేదో వివరించాడు. ప్రతిఒక్కరూ మరొకరిలా ఉండేందుకు ప్రయత్నించకుండా, ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకోవాలని అన్నాడు.
"నాకు తెలిసి ఆట అనేది ప్రదర్శపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కోహ్లీ లాంటి వ్యక్తుల నుంచి దాన్ని మనం తీసుకోలేం. అతడి వ్యక్తిత్వం కూడా అంతే. మీరెందుకు విరాట్ లా వ్యవహరించరు అని చాలా మంది నన్ను అడిగారు. కానీ నేను బెస్ట్ గా ఇవ్వగలిగేది అది కాదు. ఒకరిలా ఉండటానికి నేను ప్రయత్నిస్తే అది అసమంజసంగా ఉండదు. విరాట్ లా టాటూలు వేసుకుని, అతడిలా ప్రవర్తిస్తే అది సెట్ కాదు. నాకు ఆందోళ కలిగించే విషయం ఏంటంటే జూనియర్ క్రికెట్ గురించి. విరాట్ వ్యవహించే తీరు గురించి ఏమీ లేదు కానీ, 12,13,14 ఏళ్ల వయసు వారు కోహ్లీలా అవ్వాలని అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదని వాళ్లు గ్రహించలేకపోతున్నారు. వాళ్లు ప్రత్యేక శైలిని ఏర్పరచుకోవాలి." అని గతంలో ద్రవిడ్ అన్నాడు.