తొలిసారి సునీల్ గవాస్కర్ 10వేల పరుగులు చేసినప్పటి వీడియో చూశారా..? గ్రౌండ్లోకి పోటెత్తిన జనం

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఆదివారం లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 115నాటౌట్ పరుగులతో ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో రూట్ మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 10వేల పరుగులు చేసిన 14వ బ్యాటర్‌గా నిలిచాడు. ఇకపోతే 10వేల పరుగుల మార్క్ చేరిన తొలి ప్లేయర్ మన ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఇక 1987 మార్చి 7న అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్ తన 10వేల టెస్టు పరుగులను సాధించాడు.
పాకిస్థాన్ స్పిన్నర్ ఇజాజ్ ఫకీహ్ బౌలింగ్‌లో గవాస్కర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ ఫీట్ అందుకున్న అనంతరం గవాస్కర్‌ను అభినందించడానికి అహ్మదాబాద్ స్టేడియంలో ప్రేక్షకులు ఒక్కసారిగా గ్రౌండ్లోకి దూసుకొచ్చారు. ప్రేక్షకులను ఆపేందుకు అప్పట్లో పటిష్ఠ సెక్యూరిటీ నెట్ వర్క్ ఉండేది కాదు. దీంతో ప్రేక్షకులు గవాస్కర్‌ను చుట్టుముట్టి అభినందనలతో ముంచెత్తాడు. అభిమానులు పెద్దఎత్తున గ్రౌండ్లోకి ప్రవేశించడంతో కొంత సమయం పాటు ఆట నిలిచిపోయింది.

సింగిల్ తీస్తూనే పట్టలేనంత ఆనందంతో..
క్రికెట్ చరిత్రలో తొలిసారి 10,000 పరుగుల మైలురాయి సాధించిన సందర్భంగా గవాస్కర్ ఒకసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఆ ఇన్నింగ్స్ ముందు నేను 10,000పరుగులు చేయడానికి నాకు ఇంకా 57పరుగులు అవసరమని తెలుసు. నేను సాధారణంగా స్కోర్‌బోర్డ్ వైపు చూడను.
కానీ హాఫ్ సెంచరీ పూర్తవడంతో గ్రౌండ్లో ప్రేక్షకుల చప్పట్ల వల్ల ఇంకా 7పరుగులు చేయాలని మైండ్లో మెదిలింది. నేను సింగిల్‌తో నా 50 పూర్తిచేసుకున్నాను. ఇంకా 7పరుగులు చేస్తే 10వేల పరుగులు పూర్తి చేసిన వాణ్ని అవుతాను. ఇక చివరికి ఒక్క రన్ కావాల్సి తరుణంలో థర్డ్ మాన్ వైపు కట్ ఆడాను.. అంతే సింగిల్ తీస్తూనే పట్టలేనంత ఆనందపడ్డాను.' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్లు అనిపించింది
'ఆ 10,000పరుగుల మైలురాయి చేరుకోవడం నిజంగా అద్భుతం. నాకంటే ముందు ఆ ఫీట్ ఎవరూ సాధించలేదు కాబట్టి కచ్చితంగా అది స్పెషలే. నేను అంతకుముందే 9,000పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా పేరొందాను. కానీ 9,000అనేది నాలుగు అంకెల సంఖ్య. 10,000అనేది ఐదు అంకెల సంఖ్య. అదో స్పెషల్ డిజిట్. కాబట్టి ఆ ఫీట్ సాధించాక.. నాకు ఇక అమాంతం మొదటిసారే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు అనిపించింది' అని గవాస్కర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

అత్యంత పిన్న వయసులో ఈ ఫీట్ అందుకున్న రూట్
ఇకపోతే అత్యంత తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన వారిలో కుక్ (31ఏళ్ల 157రోజులు), రూట్(31ఏళ్ల 157రోజులు), తొలి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత 2వ స్థానంలో సచిన్ టెండూల్కర్ (31ఏళ్ల 362రోజులు), 3వ స్థానంలో జాక్వెస్ కల్లిస్ (33ఏళ్ల 134రోజులు), రికీ పాంటింగ్ (33ఏళ్ల 162రోజులు) ఉన్నారు. న్యూజిలాండ్ మీద తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్.. మూడు టెస్టుల సిరీస్‌లో (1-0)తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇక కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ కాస్త పటిష్ఠంగా కన్పిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications