Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్రమ్‌ను నీ భుజాల మీద చేతులు వేయనీయొద్దు: సచిన్‌కు సన్నీ

హైదరాబాద్: తాను క్రికెట్ ఆడే రోజుల్లో సీనియర్లను గమనిస్తూ వారి నుంచి ఎంతో నేర్చుకునేవాడినని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ రాసిన 'డెమోక్రసీస్‌ లెవెన్‌-ది గ్రేట్‌ ఇండియన్‌ క్రికెట్‌ స్టోరీ' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గవాస్కర్‌తో పాటు పాతతరం ఆటగాళ్లు నారీ కాంట్రాక్టర్‌, మాధవ్‌ ఆప్టే, అజిత్‌ వాడేకర్‌, అజహరుద్దీన్‌, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తదితరులు హాజరయ్యారు.

 విండిస్ దిగ్గజ క్రికెటర్లను చూసి భారత ఆటగాళ్లు భయపడేవారు

విండిస్ దిగ్గజ క్రికెటర్లను చూసి భారత ఆటగాళ్లు భయపడేవారు

ఈ కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్లు అయిన సర్‌ గారీఫీల్డ్‌ సోబర్స్‌, రోహన్‌ కనాయ్‌లను చూసి భయపడుతూ ఉండేవారని తెలిపాడు. 1971లో జరిగిన వెస్టిండిస్ పర్యటనలోనే సునీల్ గవాస్కర్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పాకిస్థాన్‌ క్రికెటర్లతో మైదానం వెలుపల స్నేహం గురించి కూడా సన్నీ ఈ సందర్భంగా వెల్లడించాడు.

 వసీం అక్రమ్‌ను నీ భుజాల మీద చేతులు వేయనీయొద్దు

వసీం అక్రమ్‌ను నీ భుజాల మీద చేతులు వేయనీయొద్దు

సచిన్‌ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో అతడికి ఇచ్చిన సలహాను గవాస్కర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. 'నువ్వు టాస్‌ కోసం మైదానంలోకి వెళ్లే సమయంలో పాకిస్థాన్‌ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ను నీ భుజాల మీద చేతులు వేయనీయవద్దు. వారు అప్పుడప్పుడూ అలా చేస్తుంటారు. ఇది దేశభక్తికి సంబంధించి న విషయం. కాబట్టి అలా చేయనీయొద్దని చెప్పాను' అని గవాస్కర్ వివరించాడు.

 కపిల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సునీల్ గవాస్కర్

కపిల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సునీల్ గవాస్కర్

ఇక, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్‌పై కూడా సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎవరైనా సరే భారత్‌ క్రికెట్‌ జట్టుకు ఆడొచ్చు, కెప్టెన్‌గా కూడా చేయొచ్చనే నమ్మకాన్ని కపిల్‌ కలిగించాడని సన్నీ చెప్పాడు. మెట్రో కానీ నగరం నుంచి వచ్చిన ఓ ఆటగాడికోసం జనం మైదానాలకు పోటెత్తారంటే అది కపిల్‌ వల్లే సాధ్యమైందని గవాస్కర్ అన్నాడు.

 కోహ్లీలో ఎలాంటి మార్పూ లేదు

కోహ్లీలో ఎలాంటి మార్పూ లేదు

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్న సమయంలోనే అతడిలో దూకుడు గుర్తించానని, ఆ లక్షణం ఇప్పుడు జట్టంతటికీ వ్యాపించిందని అన్నాడు. 'భారత్ తరుపున అరంగేట్ర సమయానికి, ఇప్పటికీ కోహ్లీలో ఎలాంటి మార్పూ లేదు' అని సచిన్‌ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+