Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్‌పై నాకు చాలా కోపం వచ్చింది: టెండూల్కర్

When Sachin Tendulkar was 'fuming' at Rahul Dravid

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్స్ మెన్, టీమిండియా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు సందర్భంగా మిత్రులందరూ అతనికి శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. 45వ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న ద్రవిడ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్నారు.

క్రికెట్ ఒక జెంటిల్‌మాన్ గేమ్ అనే మాటను ద్రవిడ్ సాకారం చేశాడు. క్రికెట్ రంగంలో గౌరవప్రదనీయమైన వ్యక్తులలో ద్రవిడ్ ఒకరు. చాలామంది యువతకు ఆదర్శనీయమైన వ్యక్తి. క్రీడాకారుడిగా తన పదిహేనేళ్ల కెరీర్‌లో 164 టెస్ట్‌లు(13,288పరుగులు), 344వన్డేలు(10,889), ఒక టీ20(31)పరుగులను సాధించాడు.

భారత క్రికెట్ అభిమానులకు గుర్తుండి పోయే మూడు విషయాల్లో ద్రవిడ్ ఒకడు. మొదటిది 2004లో ముల్తాన్ టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్రిపుల్ సెంచరీ(304), రెండోది పాకిస్థాన్ గడ్డపై అదే జట్టుతో భారత్ ఆడి మొట్ట మొదటి సారి గెలిచింది. మూడోది టెండూల్కర్‌(194)తో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ నుంచి డిక్లేర్ కావడం విషయం. ఈ విషయాన్ని టెండూల్కర్ తన ఆటో బయోగ్రఫీ అయిన 'మై వే' అనే పుస్తకంలో రాశాడు.

'నేను చాలా అసంతృప్తికి గురైయ్యాను. అతనిపై చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో జట్టులో ఆటగాళ్లందరూ ఒకటే అనుకున్నారు. నేను ఖచ్చితంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో ఒకటి అంటాను అనుకున్నారు. నాది అలాంటి వ్యక్తిత్వం కాదు కాబట్టి ఊరకుండిపోయాను. ద్రవిడ్ చాలా మంచి వ్యక్తి ఆటను ఆటలానే చూస్తాడు.' అని సచిన్ పేర్కొన్నాడు.

''ద్రవిడ్ నేను ఒంటరినైపోయాను''. అంటూ సచిన్ ట్వీట్ ద్వారా తన శుభాకాంక్షలను ద్రవిడ్‌కు అందజేశారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 16:10 [IST]
Other articles published on Jan 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+